చాలామందికి రాత్రిపూట పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధారణం. అయితే కొన్ని కలలు నిజమవుతాయని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ఉదయాన్నే వచ్చిన కలలు నిజమవుతాయని వారు తెలియజేస్తున్నారు. అయితే ఒక్కోసారి మనకు పీడకలలు వస్తూ ఉంటాయి. ఒకేసారి నిద్రలో లేచి ఉలిక్కి పడుతూ ఉంటారు. మరి ఎలాంటి పిడకలలు ఎందుకు వస్తాయి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. మనం పడుకున్న సమయంలో మనకు తెలుసో తెలియకో కలల ప్రపంచంలోకి వెళుతూ ఉంటాం.
Advertisement
also read:కస్తూరి స్విమ్మింగ్ వీడియో పై నెటిజన్ అలాంటి కామెంట్…దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చిన నటి ..!
Advertisement
ఈ ప్రపంచంలో నియంత్రణ అనేది ఉండదు. ఇందులో ముఖ్యంగా మంచి కలలు వస్తే హాయిగా నిద్రపోతాం. ఒకవేళ బ్యాడ్ డ్రీమ్స్ వస్తే మాత్రం నిద్రకు భంగం కలిగినట్టే. అయితే ఇలాంటి పీడకలలకు చెక్ పెట్టాలి అంటే మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు కలలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. అంతేకాకుండా మీకు తరచూ ఈ కలలు వస్తూ ఉంటే నల్లని గుడ్డలో పటీకను కట్టి ఉంచండి. ఇలా చేయడం వల్ల చెడు కలల నుండి విముక్తి లభిస్తుంది.
మంగళవారం రోజున పటిక ముక్కను పిల్లల తలపై ఉంచాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం కర్పూరం మంచి వాతావరణాన్ని ఇంటి శుద్ధిని చేయడానికి ఉపయోగిస్తారు. కర్పూరం యొక్క సువాసన మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. కొన్నిసార్లు నిద్రించే దిశ కూడా పీడకలలకు కారణం కావచ్చు. ముఖ్యంగా మీ పాదాలు తలుపు వైపు పెట్టి నిద్రించకూడదు. దీనివల్ల ఆరోగ్యం కూడా చెడిపోతుందని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు.
also read: