చాలామంది మాంసాహారం లేనిదే ఒక ముద్ద కూడా ముట్టలేరు. డైలీ ఆహారంలో మాంసాహారం భాగం కావాల్సిందే.వీరు బయటకు వెళ్లినా కానీ మాంసాహారాన్ని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా మాంసాహారాన్ని ఇష్టంగా తినే కొంతమందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తినడం మానేయాలని అంటున్నారు.. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొంతమంది శరీరంపై దద్దుర్లు వస్తూ ఉంటాయి.
Advertisement
Advertisement
అలా మాంసాహారం తిన్న వెంటనే ఈ లక్షణాలు ప్రతిసారి కనిపిస్తే మాంసాహారం తినడం మానేయడమే కాకుండా వైద్యుని సలహా తీసుకోవాలని అంటున్నారు. కొంతమంది అతిగా మాంసాహారం తిన్న సమయంలో శరీరం వాపుకు గురవుతుంది. ముఖ్యంగా కంటి పైన, ముఖం పైన వాపు రావడం, కాళ్ళు విపరీతంగా ఉబ్బిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారు కూడా మాంసాహారాన్ని మానేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చాలామందికి మాంసాహారం తిన్న తర్వాత అది జీర్ణం కాక వికారంగా వాంతులు వస్తూ ఉంటాయి.
దీంతో ఏదో చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివారు మాంసాహారాన్ని తక్కువగా తినడం మంచిదని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా కొంతమందికి మాంసాహారం తిన్న వెంటనే కళ్ళ నుంచి నీళ్లు కారటం, శ్వాస సరిగ్గా రాకపోవడం గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏ లక్షణాలు కనిపించిన మాంసాహారానికి దూరంగా ఉండాలని డాక్టర్లు అంటున్నారు.
also read: