Home » Jan 20th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 20th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

కామారెడ్డి లో రైతుకు చేస్తున్న ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. మున్సిపల్‌ సమావేశం ఏర్పాటు ప్రకటనతో రైతులు శాంతించారు. నేడు అడ్లూర్‌లో రైతు జేఏసీ సమావేశం జరగనుంది.

Advertisement

రేపటి నుంచి 10 రోజుల పాటు వైజాగ్‌లో పుష్ప-2 మూవీ షూటింగ్‌ జరగనుంది.

తెలంగాణలో క్యాడర్‌ అలాట్‌మెంట్‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 11 మంది ఆలిండియా సర్వీసెస్‌ అధికారుల అంశంపై హైకోర్టులో విచారణ జరగనుంది. 9 మంది ఐఏఎస్‌, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను ఏపీకి పంపడాన్ని ఆపేసిన క్యాట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది.

సికింద్రాబాద్‌ దక్కన్‌ మాల్‌లో గతరాత్రి మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటల వేడికి పిల్లర్లు సైతం దెబ్బ తిన్నాయి. బిల్డింగ్‌ కూల్చివేయాలని అధికారుల ఆదేశం ఇవ్వడం తో ఇవాళ లేదా రేపు భవనాన్ని కూల్చివేసే అవకాశం ఉంది.

Advertisement


తిరుమలలో 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,988 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు.

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మరో షాక్‌ తగిలింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌, రాపూర్‌ ఎస్సైలను ప్రభుత్వం బదిలీ చేసింది. వెంకటగిరిలో మరికొందరు అధికారుల బదిలీకి రంగం సిద్ధం చేశారు.

నేడు 11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవితవ్యం తేలనుంది. 9 మంది ఐఏఎస్, 3ఐపీఎస్ అధికారుల క్యాడర్ అలాట్ మెంట్ పై తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సస్పెన్స్ కూడా వీడనుంది.

APSRTC కి ఒక్క రోజులోనే రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈనెల 18వ తేదీ ఒక్క రోజే రూ. 23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

Visitors Are Also Reading