Home » Jan 18th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 18th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

సిద్దిపేట మద్దూరు మండలం చెల్మి తండాలో సోనుసూద్‌ పర్యటించనున్నారు. లాక్‌డౌన్‌లో సోనుసూద్‌ చేసిన సేవలకు తండా వాసులు గుడి కట్టారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు చెల్మి తండాకు సోనుసూద్‌ విచ్చేస్తున్నారు.

Advertisement

ప్రగతిభవన్‌లో ఢిల్లీ, పంజాబ్‌, కేరళ సీఎంలు, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌, సీపీఐ నేత డి.రాజాతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో యాదాద్రికి నేతలు చేరుకోనున్నారు.

ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌తో మెట్రో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. నాగోల్‌-రాయదుర్గం రూట్‌లో ఉ. 11 నుంచి సా. 4 గంటల వరకు 5 నిమిషాలకో ట్రైన్ నడవనుంది. సా. 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 నిమిషాలకో ట్రైన్‌ నడవనుంది. స్టేడియం మెట్రో స్టేషన్‌లో 10 టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్‌ కలకలం రేగింది. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఎల్లమ్మ, దుర్గయ్య, ఇస్తారి, ఇమ్మయ్య, రాజయ్య అనే వ్యక్తుల కిడ్నాప్‌ జరిగింది. 8 ఏళ్ల క్రితం రూ.2 లక్షలు అప్పుగా రాజయ్య తీసుకున్నారు. దాంతో వడ్డీతో పాటు అసలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కిడ్నాప్ చేశారు.

Advertisement

నేడు స్వర్గీయ ఎన్టీ రామారావు 27వ వర్ధంతి జరగనుంది. ఎన్టీఆర్ ఘాట్‌లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ కు నివాళులు అర్పించారు.

నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

నేడు భారత్ వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఉప్పల్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

నేడు ఖమ్మంలో బీఆర్ఎస్‌ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ, కేరళ, పంజాబ్‌ సీఎంలు, మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా తదితరులు హాజరుకానున్నారు.

నేడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హైదారాబాద్ చేరుకోనున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న తర్వాత తొలిసారి హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు.

Visitors Are Also Reading