Home » నా కొడుక్కు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటూ బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్..!!

నా కొడుక్కు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటూ బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్..!!

by Sravanthi
Ad

సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటేనే కార్లు, బంగ్లాలు, లగ్జరీ లైఫ్ గడపాలని చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వారు సంపాదించిన డబ్బుతో బంగ్లాలు, కార్లు,భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడు మాత్రం వీటన్నింటికి వ్యతిరేకం. ఆయన ఎవరో కాదు.. నటుడు బ్రహ్మాజీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా.. కొనసాగుతున్నారు. ఏటా ఆయన పదుల సంఖ్యలో సినిమాల్లో నటిస్తారు. ఈ మధ్యకాలంలో బ్రహ్మాజీ లేకుండా సినిమా రావడం లేదు. ఈస్ట్ గోదావరి కి చెందిన బ్రహ్మాజీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడట.

Advertisement

అలాంటి బ్రహ్మాజీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన తల్లిదండ్రులు కేవలం విద్యాబుద్ధులు చెప్పించి పెంచి పోషించారట. ఎలాంటి ఆస్తిపాస్తులు తనకు ఇవ్వలేదని తన కాళ్లపై తాను సొంతంగా ఎదిగానని చెప్పుకొచ్చారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను ఎంత డబ్బు వచ్చినా కానీ పెద్దగా లైఫ్ స్టైల్ మార్చుకోలేదని అన్నారు బ్రహ్మాజీ. మా నాన్న నన్ను ఏ విధంగా సాదాసీదాగా పెంచారో, నేను కూడా నా కొడుక్కి ఏ ఆస్తిపాస్తులు ఇవ్వనని, ఎదగడానికి కావలసిన బ్రతుకుతెరువు మాత్రమే చూపిస్తానని అన్నారు బ్రహ్మాజీ.

Advertisement

తాను బ్రతికున్నంత కాలం లగ్జరీగా లైఫ్ లీడ్ చేయడం తనకు తన భార్యకు ఎంతో ఇష్టమని చెప్పారు బ్రహ్మాజీ. తనకు వచ్చిన డబ్బుతో దేశ విదేశాల్లో తిరుగుతానని ప్రపంచాన్నంతా చుట్టేస్తానని ఆస్తిపాస్తులు మాత్రం కూడబెట్టనని, పోయేటప్పుడు పట్టుకు పోయేది ఏమీ లేదని తెలియజేశారు. తన కొడుకు కూడా కష్టపడి తన లైఫ్ గురించి తెలుసుకొని ఎదగాలని హితవు పలికారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

also read:తమిళ స్టార్ హీరో కి జోడిగా ఐశ్వర్య.. 22 ఏళ్ల తర్వాత..!

Visitors Are Also Reading