ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి డబ్బు వెనుకబడి అధిక డబ్బు సంపాదించాలని ఆశతో కనీసం ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎప్పుడు కూడా పని పని అంటూ తిరుగుతున్నారు. ఈ మారిన జీవన విధానంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఉద్యోగం వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ విధంగా ఒత్తిడి పెరగడం జీవితంలో అనేక అనర్థాలను తీసుకువస్తుందని, దీనివల్ల వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
also read:“వీర సింహ రెడ్డి” కి ఇదొక్కటే మైనస్ అయ్యిందా ?లేకుంటే బ్లాక్ బస్టర్ అయ్యేదా ?
Advertisement
సాధారణంగా మనిషికి ఒత్తిడి పెరిగితే వ్యాధి నిరోధక శక్తి బలహీనమవుతుంది. దీనివల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయని అంటున్నారు. ఒత్తిడి పెరగడం వల్ల జీవక్రియలు సరిగ్గా జరగక ప్రేగులు పోషకాలను గ్రహించలేవు. దీనివల్ల మలబద్ధకం విరోచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా అధిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మొటిమలు, నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు అధిక తలనొప్పి వల్ల కోపం నిస్సత్తువ సమస్యలు ఎక్కువ అవుతాయి.
ఇలా కోపం, నీస్సత్తువ రావడంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువయి గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల మెదడు దెబ్బతిని అల్జిమర్స్ ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా అధిక ఒత్తిడి వల్ల ఉబకాయం బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. మరి ముఖ్యంగా ఒత్తిడికి ఫీల్ అవడం వల్ల ఆయు ప్రమాణం కూడా తగ్గే అవకాశం ఉందని , చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
also read: