Home » “వాల్తేరు వీరయ్య” ఓటిటీ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

“వాల్తేరు వీరయ్య” ఓటిటీ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్, ఈయనకు తోడుగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు.

Advertisement

రిలీజ్ కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఈరోజే ఎంతో వైభవంగా విడుదలైంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లలో మెగా అభిమానులు ప్రేక్షకులతో కలకలలాడుతున్నాయి. మరి ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్ని హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనం ఇస్తున్నాయి.

Advertisement

క్రేజీ కాంబోలో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ సంస్థ చిరంజీవి సినిమా ఓటిటి రైట్స్ ను సొంతం చేసుకుందని టైటిల్ కార్డ్స్ లో క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం సదరు సంస్థ కొన్ని కోట్ల మొత్తాన్ని అందజేసినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని విడుదలకు 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని కూడా తెలిసింది. అంటే ఇది ఫిబ్రవరి నెలకారులో కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

READ ALSO : బాలయ్యకు బిగ్ షాక్.. వీర సింహారెడ్డి డైలాగులపై జగన్ సీరియస్ !

Visitors Are Also Reading