Home » బాలయ్యకు బిగ్ షాక్.. వీర సింహారెడ్డి డైలాగులపై జగన్ సీరియస్ !

బాలయ్యకు బిగ్ షాక్.. వీర సింహారెడ్డి డైలాగులపై జగన్ సీరియస్ !

by Bunty
Ad

బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో హీరోగా పరిచయమైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్ లో సుదీర్ఘకాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ.

Advertisement

ఇదే ఉత్సాహాన్ని ఇప్పటికీ చూపిస్తున్న ఆయన వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నందమూరి హీరో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే యుఎస్ లో రికార్డు సాధించింది.

ఇవి కూడా చదవండి : రోజా పరువు తీసిన పవన్ కళ్యాణ్.. ఛీ.. రోజా.. ఓ డైమండ్ రాణి అంటూ !

Advertisement

ఈ చిత్రంలో బాలయ్య చెప్పిన డైలాగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. బుర్ర సాయి మాధవ్ రాసిన డైలాగులు బాలయ్య నోటా తూటాల్లా పేలాయి. అయితే కొన్ని డైలాగులు మాత్రం పొలిటికల్ అజెండాతో అధికార వైసీపీపై విమర్శల బాణం ఎక్కుపెట్టినట్టుగానే అనిపిస్తాయి. అయితే, ఈ వీర సింహారెడ్డి సినిమా, సినిమా డైలాగులపై జగన్ ప్రభుత్వం అసహనం చేస్తోంది. ఈ సినిమాలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విజయవాడలో నిన్న అర్ధరాత్రి కొందరు అధికారులు స్పెషల్ షో చూశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని నిర్దారణకు వచ్చింది సర్కార్. ఇప్పటికే వీరసింహారెడ్డి డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డైలాగులు ఎందుకు వాడారో తెలుసుకోవాలని అధికారులకు సూచనలు చేసిందట జగన్ సర్కార్. వీర సింహారెడ్డి డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏం చేయాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన అవుతోందట. మరి ఈ సినిమాపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుదో చూడాలి.

read also : వివాదంలో ‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !

Visitors Are Also Reading