Home » Jan 13th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 13th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

పవన్ కళ్యాణ్ పగటి వేషాలు వేస్తున్నాడు… చంద్రబాబుకు పవన్ పూర్తిగా అమ్ముడుపోయాడని మంత్రి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు, పవన్ ఒకే తానులో ముక్కలు.. 2014-19 పాలనపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు.. చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ సభను పెట్టారని అన్నారు.

Advertisement

గుంటూరు పొన్నూరు శ్రీలక్ష్మీ థియేటర్‌లో సాంకేతిక లోపంతో వాల్తేరు వీరయ్య మూవీ బెనిఫిట్ షో ను నిలిపివేశారు. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,354 మంది భక్తులు.

ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. లింగంపల్లి-నాంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో ట్రాక్ మరమ్మతుల కారణంగా 19 సర్వీసులు రద్దు చేశారు.

పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్.. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి అంటూ అంబటి రాంబాబు కౌంటర్ వేశారు.

Advertisement

రెండు సార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిన పవన్‌తో తిట్టించుకోవాలా? తూ.. ప్రజల కోసం తప్పట్లేదు అంటూ మంత్రి రోజా సంచనలన వ్యాఖ్యలు చేశారు.

బాపట్ల MP, కలెక్టర్ల మధ్య ప్రోటోకాల్ వివాదం నెలకొంది. MP నందిగం సురేష్‌ను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడంలేదని ఆరోపణ.. ప్రోటోకాల్ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానంటున్న MP.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలకు ఆహ్వానం అందలేదన్న MP.. CMకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. హై బీపీ తో రాహుల్ బాధపడుతున్నాడు. దాంతో మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు తరలించినట్టు తెలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల్లో పోటీ కోసం పార్టిని బలోపేతం చేస్తుంది.

Visitors Are Also Reading