మనం సాధారణం గా దేవాలయాలకు వెళ్లిన సమయాల్లో దేవుడికి ప్రార్థిస్తుంటాం. ప్రదక్షణలు చేసిన తర్వాత దేవుడి ముందు నిలబడి మన కోరికలను దేవుడికి చెప్పుకుంటాం.
Advertisement
మన తో పాటు మన కుటుంబ సభ్యులు కూడా అందరూ దేవుడి ముందు నేరుగా నిలబడి దేవుడి కి నమస్కారం చేస్తూ.. మన కోరికలను మనస్సు లో దేవుడికి చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనందరికీ తెలియని విషయం ఎంటంటే..? ఎప్పుడూ కూడా దేవుడి ముందు నేరుగా నిలబడకూడదు.
Advertisement
ఇలా నేరుగా నిలబడితే ఆధ్యాత్మికంగా ప్రమాదమే అని పండితులు చెబుతూ ఉంటారు. అలాగే ఒక్కో సారి దేవాలయం లో దేవుడి ముందు నేరుగా నిలబడి ప్రార్థిస్తే.. అక్కడ ఉండే అయ్యాగార్లు.. కాస్త పక్కకు జరిగి ప్రార్థించు కో బాబు అని సలహా ఇస్తారు. అయితే అప్పుడు మనం దేని గురించో అలా చెబుతున్నాడని అనుకుంటాం. అయితే అలా దేవుడి ముందు నేరుగా నిలబడటం అనేది ప్రమాదం. అది ఎందుకో ఇప్పుడు చూద్ధం. దేవుడి విగ్రాహాల ముందు నేరుగా నిలబడి ప్రార్థించడం వల్ల ఏం జరుగుతుందంటే.. దేవుతల విగ్రహాల నుంచి దైవకృపా శక్తి ఎప్పుడూ వెలువడుతూనే ఉంటుంది.
దైవకృపా శక్తి తరంగాల రూపంలో భక్తుడి వద్ద కు చేరుకుంటాయి. అయితే మనం దేవుడి విగ్రహానికి నేరుగా నిలబడం వల్ల అవి నేరుగా భక్తుడి పైన పడుతాయి. ఇలా ఆ తరంగాలు నేరుగా వ్యక్తులపై పడటం చాలా ప్రమాదం అని పండితులు చెబుతుంటారు. అందుకే దేవడి విగ్రాహాలకు ఎదురుగా నిలబడి ఉంటే వాళ్లు ఎడమ వైపు గానీ కూడి వైపునకు జరిగి ఉండాలని సూచిస్తారు.
Also Read: ఆటో డ్రైవర్ గా మారిన బిగ్ బాస్ విన్నర్…!