పూర్వకాలంలో ఇష్టమైన వ్యక్తుల పేర్లను చేతిపై పచ్చబొట్టుగా వేయించుకునేవారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ గా మారిపోయింది. ఇక కుర్రకారుకు టాటూ ఉంటేనే విలువ అనే విధంగా మారింది. వారికి నచ్చిన డిజైన్లలో టాటూలు వేయించుకొని తెగ సంబరపడిపోతుంటారు. అయితే టాటూలవల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఈ టాటూల వల్ల స్వేద గ్రంధులు దెబ్బతింటాయని, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని తాజాగా ఒక అధ్యయనంలో వెళ్లడైంది.
Advertisement
శరీరంలో ఉండే ఉష్ణోగ్రతను శ్వేత గ్రంధులు నియంత్రించి చెమటను బయటకు పంపుతాయి. తద్వారా ఉష్ణోగ్రత సాదారణ స్థితికి వస్తుంది. అయితే టాటూలు వేసే క్రమంలో సూదులు లేదా టాటూలో సిరా చర్మం లోపల ఉండేటువంటి గ్రంథాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు. దీనివల్ల అవి మూసుకుపోయి టాటూ వేసిన చోట చెమట బయటకు రాకుండా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. మన శరీరంపై ఎక్కడైతే టాటూ వేయించుకుంటామో అక్కడ నిమిషానికి 50 నుంచి 3600 రంద్రాలు పడతాయని, వీటివల్ల స్వేదా నాళాలు దెబ్బతింటాయట.
Advertisement
అయితే పరిశోధకులు టాటూ వేసుకున్నా వారిని, వేసుకొని వారిపై ఒక చిన్న టెస్ట్ చేశారట. ఈ ఇద్దరినీ 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంట పాటు నిలబెట్టారు. ఇద్దరికీ చెమటలు పట్టాయి. కానీ టాటూ వేసుకోని వారి కంటే టాటూ వేసుకున్న వారి చర్మం నుండి చెమట చాలా తక్కువ రావడాన్ని పరిశోధకులు గుర్తించారు. దీన్నిబట్టి టాటూలు వేసుకుంటే ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు అంటున్నారు.
also read: