పెళ్లికి ముందు జీవితం ఎలా ఉన్నా కూడా పెళ్లి తరవాత తమ భాగస్వామితో జీవితం అందంగా ఉండాలని ఊహించుకుంటారు. భార్య అయినా భర్త అయినా అందమైన జీవితం కావాలని కలలు కంటారు. అయితే సంసారం అన్నతరవాత కేవలం సంతోషాలు మాత్రమే కాకుండా బాధలు కూడా ఉంటాయి. కేవలం అందమైన క్షణాలు మాత్రమే కాకుండా గొడవలు కూడా ఉంటాయి.
Advertisement
అయితే కొన్నిసార్లు గొడవలు పడినప్పుడు భార్య భర్తలు కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. ఒకరినొకరు దూషించుకుంటారు. అయితే ఎంత కోపం వచ్చినా భార్య తన భర్తను కొన్ని మాటలు అనకూడదట. అలా భార్య భర్తను అనకూడని మాటలు ఏవో ఇప్పుడు చూద్దాం..ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు లేదా బంధువులు లేదా స్నేహితులు ఉన్న సమయంలో భార్య భర్తను చులకన చేసి మాట్లాడకూడదు.
Advertisement
అలా చులకన చేసి మాట్లాడినట్లయితే భర్త గౌరవం పోతుంది. కాబట్టి భార్యలు వెనకా ముందు చూసుకుని మాట్లాడాలి. కొంతమంది భార్యలు భర్తల నిర్నయాలను అస్సలు పట్టించుకోరు. కానీ భర్తల నిర్నయాలకు కూడా విలువ ఇవ్వాలి. అలా చేయకపోతే కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా కొంతమంది తమ భర్తలను పిల్లల ముందే తిడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల పిల్లలకు కూడా తమ తండ్రి పై గౌరవం లేకుండా పోతుంది. దాంతో తప్పు చేసినా వారు భయపడకుండా ఉంటారు. కాబట్టి పిల్లల ముందు భర్తలను తిట్టకూడదు.
ALSO READ : ‘వీర సింహ రెడ్డి’ ట్రైలర్ లో మనకుకనిపించిన ఈమె ఎవరో తెలుసా ?