సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆహారం, చేసే పనులు, ఇతరత్రా విషయాల గురించి కాస్త కంగారు పడుతూ ఉంటారు. ఏమి తినాలి ఏమి తినకూడదు. జర్నీ చేయవచ్చా లేదా.. ఒకవేళ అత్యవసరం జర్నీ చేయవలసి వస్తే ఏం చేయాలి అనే విషయాల్లో చాలామంది క్లారిటీ లేకుండా ఉంటారు. అలాంటివారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.. కొన్ని విమాన, రైల్వే సంస్థలు వాళ్ళు 28 వారాలు దాటిన గర్భిణీ స్త్రీలను అనుమతించరు. ముఖ్యంగా విమాన సంస్థలు ఈ రూల్స్ ఎక్కువ పాటిస్తాయి.
Advertisement
Also read;హీరో అబ్బాస్ కూతుర్ని చూశారా..ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా వేస్ట్..!
ఒకవేళ తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే డాక్టర్ నుంచి అనుమతి పొందిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు గర్భిణీలు మధ్య వరుసలో ఉన్న చివరి సీటు ఎంచుకోవడం మంచిదట. దీనివల్ల వారు వాష్ రూమ్ కి వెళ్లడానికి వీలుగా ఉంటుందని అంటుంటారు. తరచూ వీళ్ళు పండ్ల రసాలు, మంచినీళ్లు తాగుతూ ఉండాలి. సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. 36 వారాలు దాటిన గర్భిణీ స్త్రీలకు రైలు ప్రయాణం మంచిదే. దూర ప్రయాణం చేసేటప్పుడు స్లీపర్ కోచ్ లో అది లోయర్ బెర్త్ ఎంచుకోవాలి. ఇక కారులో ప్రయాణించే సమయంలో అయితే వెనుక సీట్ లో కూర్చోవాలి.
Advertisement
సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ముఖ్యంగా కాళ్లు చాపుకోవడానికి స్థలం ఉంచుకుంటే మంచిది. దూర ప్రయాణాలు చేసినట్లయితే ద్రవపదార్థాలు తీసుకోవాలి. అన్నం వంటివి తింటే వాంతులు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లో దొరికే ఆహారం అస్సలు తీసుకోరాదు. మనం ఇంటి నుంచి స్నాక్స్ భోజనం తీసుకెళ్లడం మంచిది. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మందులు వెంట తీసుకెళ్లాలి.. బరువైన లగేజీ ఎప్పుడు కూడా పట్టుకెళ్లవదు. వీలైతే ఎవరినైనా తోడుగా తీసుకెళ్లడం మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
Also read;చలికాలంలో ఎసిడిటీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఫుడ్స్‌ను కాస్త దూరం పెట్టండి..!