తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటీమణుల్లో సౌందర్య అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన హీరోయిన్. ఆమె ఇండస్ట్రీకి దూరమై చాలా ఏళ్లయింది. కానీ తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నేటి తరం యువ హీరోయిన్లకు సౌందర్య రోల్ మోడల్ అని చెప్పవచ్చు. అప్పట్లో నీకు ఎలాంటి భార్య కావాలి అని అడిగితే సౌందర్య లాంటి భార్య కావాలని చాలామంది చెప్పుకునే వారట.. సౌందర్య తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో తెరను పంచుకుంది. అప్పట్లో ఈమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వేచి చూసేవారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
also read:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లిసందడి హీరోయిన్ రవళి
Advertisement
ఇలా ఎంతోమంది హీరోలతో నటించిన సౌందర్య.. ఆ ఒక్క హీరోతో నటించడానికి ఒప్పుకోలేదట.. అతడు హీరోగా ఉంటే నేను ఆ సినిమాలో నటించలేను అని డైరెక్టర్ కు మొహం మీదే చెప్పిందట సౌందర్య. ఇంతకీ సౌందర్య రిజెక్ట్ చేసిన హీరో ఎవరయ్యా అంటే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో మరియు స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన ఎన్నో సినిమాల్లో చేసి మంచి గుర్తింపు సాధించాడు.
ఆయన ఎవరో కాదు స్టార్ కమెడియన్ ఆలీ. ఆలీ హీరోగా ఎస్వి. కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన యమలీల మూవీ ఎలాంటి హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా కథ విని హీరో ఎవరు అని అడిగితే ఆలీ అని చెప్పారట. దీంతో సౌందర్య నేను చేయను అని ముఖం మీదే చెప్పేసిందట. దీంతో డైరెక్టర్ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఇంద్రజాను హీరోయిన్ గా పెట్టి సినిమా తీశారు. సినిమా సూపర్ హిట్ అయ్యి ఇంద్రజకు మంచి సినీ కెరియర్ ను అందించిందని చెప్పవచ్చు.
also read:రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వరుడు ప్రముఖ వ్యాపారవేత్త.. ఎవరంటే..?