Home » నా భార్య లేకుంటే నా బ్రతుకేంటో..అంటూ ఎమోషనల్ అయిన శివ బాలాజీ..!!

నా భార్య లేకుంటే నా బ్రతుకేంటో..అంటూ ఎమోషనల్ అయిన శివ బాలాజీ..!!

by Sravanthi
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి శివ బాలాజీ. చందమామ సినిమాలో శివబాలాజీ యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమానే కాకుండా ఆయన చాలా సినిమాల్లో హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. శివ బాలాజీ మొదటిసారిగా ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ అనే చిత్రంతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

also read;Prabhas: హీరో కాకపోయి ఉంటే ఆ పని చేసేవాడిని..!!

అయితే మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకున్న శివ బాలాజీ ఆ తర్వాత సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటి సంపాదించుకున్నారు. అంతేకాకుండా విజేతగా నిలిచాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివబాలాజీ తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాల గురించి బయట పెట్టాడు. నేను నా జీవితంలో కోట్ల ఆస్తులు నష్టపోయాను. కానీ నా భార్య సహకారం వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాను. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఈము పక్షుల పెంపకాన్ని మొదలుపెట్టాం.మొదటగా 500 పక్షులతో యూనిట్ స్టార్ట్ చేశాం.

Advertisement

వీటికి నెలకు 5 లక్షల వరకు ఖర్చయ్యేది. కానీ చివరికి వచ్చేసరికి వీటిని మార్కెట్ చేయడానికి అవకాశం లేదని తెలిసింది. ఇందులో తీవ్రంగా నష్టపోయాం. దీని తర్వాత మరో వ్యాపారం స్టార్ట్ చేశాను అదే పెయిన్ రిలీఫ్ ఆయిల్, సోప్స్ ఇందులో కూడా విపరీతమైన నష్టం వాటిల్లింది. దీని తర్వాత వెంటనేస్నేహమేరా జీవితం అనే సినిమాను చేశాను. దీనికి రెండు కోట్ల వరకు ఖర్చయింది. కానీ మూవీ సరిగా ఆడలేదు. అన్ని ఒకేసారి నష్టపోయేసరికి విపరీతమైన అప్పుల్లో కూరుకు పోయాను. మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఈ తరుణంలో నా భార్య నాకు ధైర్యం చెప్పి నన్ను మామూలు మనిషిని చేసిందని చెప్పుకొచ్చారు నటుడు శివ బాలాజీ.

also read;Veera Simha Reddy Movie Dialogues: వీరసింహారెడ్డి పవర్ ఫుల్ డైలాగ్స్

Visitors Are Also Reading