Srija: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల అంటే తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. అనేకసార్లు వార్తల్లో శ్రీజ హాట్ టాపిక్ గా మారారు. మొదట రిషి భరద్వాజ్ అనే వ్యక్తిని శ్రీజ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ సమయంలో వీరి పెళ్లి వార్త హట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులను ఎదిరించి మరీ శ్రీజ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. అయితే ఒక కూతురు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి.
దాంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాలాకాలం పాటు సింగిల్ గా ఉన్న శ్రీజ కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ గతేడాది కాలంగా కళ్యాణ్ దేవ్.. శ్రీజ విడివిడిగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement
అంతేకాకుండా శ్రీజ తన సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ ఫోటోలను డిలీట్ చేసింది. మరోవైపు మెగా ఫ్యామిలీ కూడా కళ్యాణ్ దేవ్ ను పట్టించుకోవడం లేదు. ఇక త్వరలోనే కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా శ్రీజ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆ పోస్ట్ లో శ్రీజ…… డియర్ 2022..నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు, కష్టసుఖాల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకుని అమితంగా ప్రేమించే… అన్ని విధాలుగా సంరక్షించే ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం మొదలైంది…. అంటూ శ్రీజ తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇన్నర్ పీస్, సెల్ఫ్ కనెక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్ లను జోడించారు.
Also read :ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లో ఆయన్నే బీట్ చేసిన చలపతి రావు….! ఎలాగంటే…?