Home » ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లో ఆయన్నే బీట్ చేసిన చలపతి రావు….! ఎలాగంటే…?

ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లో ఆయన్నే బీట్ చేసిన చలపతి రావు….! ఎలాగంటే…?

by AJAY
Ad

అన్నగారు ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో దానవీరశూరకర్ణ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను స్వయంగా ఎన్టీఆర్ నిర్మించి నటించారు. 1977 ఈ సినిమా విడుదల అయింది. కేవలం నటించడం.. నిర్మించడమే కాకుండా ఈ పౌరాణిక చిత్రానికి కథను కూడా ఆయనే రాసుకున్నారు.

Advertisement

ఇక ఈ చిత్రంలో అన్నగారు బహుముఖ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి అప్పట్లో కేవలం 10 లక్షల బడ్జెట్ ను కేటాయించారు. కాగా ఈ సినిమా కోటి రూపాయల పైగానే వసూలు చేసింది.

Advertisement

ఈ సినిమా రన్ టైం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక రన్ టైం 4:17 నిమిషాలు ఉంటుంది. అంతేకాకుండా ఈ చిత్ర షూటంగ్ ను కేవలం నలభై మూడు రోజుల్లోనే పూర్తి చేశారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ దుర్యోధనుడు… అర్జునుడు, కర్ణుడి పాత్రలలో నటించారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలో ఆయనకు ఆత్మీయుడు అయిన చలిపతిరావు నటించారు.

చలపతిరావు ఈ సినిమాలో ఐదు పాత్రలలో నటించారు. ఇంద్రుడు, సూతుడు, విప్రుడు దృష్టద్యున్నుడు , అతిరదుడు పాత్రల్లో నటించి ఔరా అనిపించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలయ్య , హరికృష్ణ లు కూడా నటించారు. బాలయ్య అభిమన్యుడి పాత్రలో నటించగా హరికృష్ణ సినిమాలో అర్జునుడి పాత్రలో నటించాడు. సినిమాను త్వరగా పూర్తి చేయాలని బాలయ్య హరికృష్ణ లు ఈ సినిమా కోసం పెయింటింగ్ మరియు ఆర్ట్ వర్క్స్ లో సైతం పని చేశారు.

Also read : తన అనారోగ్యంపై సమంత సంచలన వ్యాఖ్యలు..మొదట్లో ఉన్న పరిస్థితులు లేవంటూ !

Visitors Are Also Reading