promissory note telugu format: సాధారణంగా మనం అప్పు తీసుకున్న మరియు అప్పు ఇచ్చిన ఇద్దరి మధ్య ప్రామిసరీ నోట్ రాసుకోవడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. మరి ఆ ప్రామిసరీ నోటు రాసే సమయంలో కొన్ని విధివిధానాలు ఉంటాయట. అవి ఫాలో అవ్వకుంటే అప్పు తీసుకున్న వ్యక్తి ఎగ్గొట్టినా కానీ మనం ఏం చేయలేమట..
ప్రామిసరీ నోటు ఎలా రాయాలి :
మరి ఆ ప్రామిసరీ నోటు రాసే విధివిధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ..అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోటు తప్పనిసరిగా రాసుకుంటాం. ఇందులో కొన్ని అంశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అవి పాటించని పక్షంలో ప్రామిసరీ నోట్ ఒక చిత్తు కాగితం లాగే జమవుతుంది.
Advertisement
1.నేను X అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను. తిరిగి నేను Xకు గానీ, X సూచించిన ఇతరులకు గానీ అప్పు తీసుకున్న డబ్బు చెల్లిస్తాననే పాయింట్ తప్పకుండా చేర్చాలి.
Advertisement
2.అప్పు ఇచ్చే వారు, తీసుకునే వాళ్లు ఇద్దరికీ 18 ఏళ్ళు నిండి ఉండాలి.
3.మతిస్థిమితం లేని వారు రాసిచ్చిన ప్రామిసరీ నోట్ చెల్లుబాటు కాదు.
4.ప్రామిసరీ నోట్ రాసుకునేప్పుడు ఇద్దరు సాక్షులు తప్పనిసరిగా ఉండాలి.
5.రెవెన్యూ స్టాంప్ అతికించి స్టాంప్ పై అడ్డంగా సంతకం పెట్టాలి.
6.ప్రామిసరీ నోట్ కి 3 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది.
7.ప్రామిసరీ నోట్ పై కోటి రూపాయల వరకు అప్పును ఇవ్వవచ్చు.
8.డబ్బులు ఎగ్గొడితే…ప్రామిసరీ నోట్ సహాయంతో న్యాయ పరంగా ఆ డబ్బును రాబట్టుకునే అవకాశం ఉంటుంది.
9.పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేప్పుడు న్యాయవాది సమక్షంలో ప్రామిసరీ నోట్ రాసుకోవడం మంచిది.
also read: