సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే మామూలు విషయం కాదు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా నటనా, టాలెంట్ లేకుంటే ఇండస్ట్రీ పట్టించుకోదు. ఏది ఏమైనప్పటికీ టాలెంట్ ఉంటే ఆఫర్లు దానికవే రావడమే కాకుండా అభిమానులు, అభిమాన సంఘాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా చాలామంది ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి బ్యాగ్రౌండ్ ఎంత ఉన్నా సక్సెస్ కాలేకపోతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
నాగబాబు, రమేష్ బాబు:
also read;మంటల్లో చిక్కుకున్న పంత్ ను కాపాడిన చిరు ఉద్యోగి.. సాహసానికి హ్యాట్సాఫ్..!!
Advertisement
తన అన్న చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ తో చిరంజీవి హీరోగా రాక్షసుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు హీరోగా పలు సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయాడు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టైగర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రమేష్ బాబు కూడా ఇండస్ట్రీలో నిలదోక్కులేకపోయారు.
సుమంత్,సుప్రియ :
ఏఎన్ఆర్ మనవడు మనవరాలు అయిన సుమంత్, సుప్రియ అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించినా కానీ అంతగా క్రేజ్ పెరగలేదు.
మంచు విష్ణు,మనోజ్ :
Advertisement
స్టార్ హీరో మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు విష్ణు,మనోజ్ పలు సినిమాలతో ఆకట్టుకున్నా కానీ, స్టార్ట్డం మాత్రం తెచ్చుకోలేకపోతున్నారు.
గౌతమ్,విక్రమ్ :
వీరిద్దరు కూడా స్టార్ హాస్యనటుల కొడుకులు. అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ నటించిన పల్లకిలో పెళ్లికూతురు యావరేజ్. ఎమ్మెస్ నారాయణ దర్శకత్వం వహించిన కొడుకు అనే మూవీ డిజాస్టర్ కావడంతో విక్రమ్ భవిష్యత్తు కూడా ఇండస్ట్రీలో ఆగిపోయింది.
కార్తీక,తులసి :
మెగాస్టార్ తో కొండవీటి దొంగ, కొదమ సింహం లాంటి హిట్ సినిమాలో నటించిన రాధా కూతుర్లు కార్తీక మరియు తులసి. హీరో జీవా మరియు కార్తీక కలిసి నటించిన రంగం మూవీ ప్రేక్షకులను కాస్త ఆకట్టుకున్న ఆ తర్వాత ఆమెకు ఆఫర్ లేకపోవడంతో జీవితం ప్రశ్నార్థకంగా మారింది. తులసి కూడా పలు సినిమాల్లో నటించిన ఆకట్టుకోలేక పోయింది.
తరుణ్:
అలనాటి హీరోయిన్ రోజా రమణి కొడుకు తరుణ్. నువ్వే కావాలి వంటి సూపర్ హిట్ సినిమాలో నటించినప్పటికీ తర్వాతి రోజుల్లో మాత్రం ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు.
also read;బిగ్ బాస్ షోకు హోస్ట్ గా బాలకృష్ణ.. కండిషన్లు వింటే ఆశ్చర్య పోవాల్సిందే..?