Home » బిగ్ బాస్ షోకు హోస్ట్ గా బాలకృష్ణ.. కండిషన్లు వింటే ఆశ్చర్య పోవాల్సిందే..?

బిగ్ బాస్ షోకు హోస్ట్ గా బాలకృష్ణ.. కండిషన్లు వింటే ఆశ్చర్య పోవాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. ఇప్పటికే ఆరు సీజన్ లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన బిగ్ బాస్ ఏడవ సీజన్ పై ఫోకస్ పెట్టింది. ఆరు సీజన్లలో 3 సీజన్లకు హోస్ట్ గా నాగార్జున వ్యవహరించడంతో చాలామందికి బోర్ కొట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆరో సీజన్ కాస్త డల్ గా కొనసాగిందని అర్థమవుతుంది. దీంతో నిర్వాహకులు ఏడవ సీజన్లో కొత్తగా ప్లాన్ చేయనున్నట్టు సమాచారం. దీని ప్రకారమే సీజన్లో హోస్టుగా బాలకృష్ణని పెడుతున్నట్టు తెలుస్తోంది .

Advertisement

Read also:ఈ పండు తింటే మధుమేహం అదుపులో ఉండడం పక్కా..!

దీనికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అన్ స్టాపబుల్ షో నుంచి మంచి పేరు సంపాదించుకున్న బాలయ్య బిగ్ బాస్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించడానికి ఓకే చెప్పారని, కానీ కొన్ని షరతులను పెట్టినట్లు సమాచారం.కచ్చితంగా ఆ కండిషన్స్ కి ఓకే చెబితే మాత్రం బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కొనసాగుతారని తెలుస్తోంది..అయితే నాగార్జునకు ఇష్టం లేకపోవడంతో బాలయ్యకు ఈ లక్కీ ఛాన్స్ దక్కిందని సమాచారం.

Advertisement

అంతేకాకుండా తాను హోస్టుగా వ్యవహరిస్తే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్ వేయకూడదని బాలయ్య సూచించారని సమాచారం. దీనికి బిగ్ బాస్ నిర్వాహకులు అంగీకరించారని అంతేకాకుండా బాలకృష్ణ కి రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే బాలయ్య హోస్ట్ గా వస్తే బిగ్ బాస్ 7 రేంజ్ మారిపోతుందని తెలుస్తోంది .. బిగ్ బాస్ 6 కంటే 7కు రేటింగ్స్ పెరిగే గ్యారంటీ ఎక్కువ ఉన్నాయని నిర్వాహకులు భావించినట్లు సమాచారం.

Also read;అంతర్జాతీయ క్రికెట్ లో ఉపయోగించే బంతి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Visitors Are Also Reading