Home » 62 వెడ్స్ 21…ముస‌లాడే కానీ మ‌హానుభావుడు..!

62 వెడ్స్ 21…ముస‌లాడే కానీ మ‌హానుభావుడు..!

by AJAY
Published: Last Updated on
Ad

ఇండియాలో అమ్మాయిల‌కు 18 అబ్బాయిల‌కు 21 సంవ‌త్స‌రాలు ఉంటే వాళ్లు పెళ్లి సిద్దం అయిన‌ట్టు. కాబ‌ట్టి ఆ వ‌య‌సు నుండి పెళ్లి చేసుకోవ‌చ్చు. అయితే పెళ్లి చేసుకోవ‌డానికి ఇద్ద‌రి మ‌ధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉండాల‌ని రూల్ ఏమీ లేదు. కానీ ప‌దేళ్ల‌లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిద‌ని త‌ల్లిదండ్రులు భావిస్తుంటారు. ప‌దేళ్లు దాటితే ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న‌ట్టు భావిస్తారు. నిజంగానే అంత‌కంటే ఏజ్ గ్యాప్ పెరిగితే స‌మస్య‌లు త‌ప్ప‌వు.

Also Read:  తెలుగులో వచ్చిన మొదటి ఫ్యాక్షన్ సినిమా ఏదో తెలుసా…? ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే…?

Advertisement

ఇదిలా ఉంటే కొంత‌మంది మాత్రం పెళ్లికి వ‌య‌సుతో సంబంధం లేదు…లింగంతో కూడా సంబంధం లేదు. ఏ వ‌య‌సులో కావాలంటే ఆ వ‌య‌సులో న‌చ్చిన వారిని పెళ్లి చేసుకోవ‌చ్చు. పెళ్లికి కావాల్సింది ప్రేమ మాత్ర‌మే అది ఉంటే స‌రిపోతుంద‌ని చెబుతుంటారు. ఇదిలా ఉంటే ఇక్క‌డ ఓ యువ‌తి అస‌లు ఏజ్ గ్యాప్ ను మ‌ర్చిపోయి తాత‌తో ప్రేమ‌లో ప‌డింది.

Advertisement

Also Read: ల్ రాజును కోలుకోలేని దెబ్బ‌కొట్టిన రెండు సినిమాలు ఏవో తెలుసా..?

ఆ యువ‌తి వ‌య‌సు 21 ఏళ్లు అయితే ఆమె పెళ్లి చేసుకున్న వ‌క్తివ‌య‌సు ఏకంగా 62 ఏళ్లు….అంటే వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 40 ఏళ్లు ఉంది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆ జంట‌ను చూసిన నెటిజ‌న్ లు అవాక్క‌వుతున్నారు. వీడియోలో 62 ఏళ్ల వ్య‌క్తి మాట్లాడుతూ హ‌నీమూన్ కోసం ఇద్ద‌రం క‌లిసి మ‌లేషియా వెళ‌తామ‌ని చెబుతున్నాడు.

ఇక యువ‌తిని అంత ఏజ్ గ్యాప్ ఉన్న వ్య‌క్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్ అని ప్ర‌శ్నిస్తే త‌ప్పేముంది అంటూ సీరియస్ అవుతోంది. ఇక వీరి పెళ్లి వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్ లు ముస‌లాడే కానీ మ‌హానుభావుడు అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Visitors Are Also Reading