తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు చలపతిరావు.విలక్షణ నటుడైన చలపతిరావు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం. దాదాపుగా 660 చిత్రాల్లో నటించిన చలపతిరావుకు ఈవివి సత్యనారాయణతో చాలా మంచి బాండింగ్ ఉందట.. ఆయన సినిమాలన్నింటిలో చలపతిరావు తప్పకుండా ఉండేవారు. 1966 లో ఇండస్ట్రీలోకి వచ్చిన చలపతిరావు, స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో నటుడిగా కొనసాగారు. ఎన్టీఆర్ అంటే చలపతిరావుకు చాలా ఇష్టం. అలాంటి చలపతిరావు తన చివరి సినిమా అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజు మూవీ లో కనిపించాడు. ఆయన చివరి చిత్రం తన కుమారుడు రవిబాబు డైరెక్షన్లో చేశాడు.
Advertisement
also read;మీరు మారాలంటూ రవితేజకు అభిమాని ఓపెన్ లెటర్..అందులో ఏముందంటే..?
Advertisement
ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. కట్ చేస్తే చలపతిరావు ఇందుమతి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయన భార్య ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మరణించింది. ఈ విధంగా చలపతిరావు జీవితంలో మొదటిసారి విషాదం చోటుచేసుకుంది. భార్య మరణం తర్వాత చలపతిరావు తన ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. తన తండ్రికి రవిబాబు రెండో వివాహం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, చలపతిరావు వాటిని సున్నితంగా తిరస్కరించాడు. ఈ విధంగా తన తండ్రి చివరి శ్వాస వదిలేవరకు రవిబాబు ఆయన వెంటే ఉన్నారు.
అయితే చలపతిరావు జీవిత కథను ఆధారంగా చేసుకుని ఆయన కొడుకు రవిబాబు ప్రముఖ దర్శకుడైన ఇవివి సత్యనారాయణ ఒక సినిమాను నిర్మించారు. అదే చిత్రం మా నాన్నకు పెళ్లి . భార్య చనిపోవడంతో ఒంటరైన తండ్రికి పెళ్లి చేయాలనే కోరిక కొడుక్కు ఉంటుంది అనే బేస్ లో కథ రూపొందించారు. 1997లో వచ్చిన ఈ చిత్రంలో చలపతిరావు పాత్రలో రెబల్ స్టార్, రవిబాబు పాత్రలో శ్రీకాంత్ ఇంకా అంబికా సిమ్రాన్ చలపతిరావు, కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటులు నటించారు. ఈ సినిమాను రోజా మూవీస్ పథకం పై అర్జునరాజు నిర్మించారు.
also read;కేజిఎఫ్ మూవీతో కైకాల కుమారుడికి ఎన్ని లాభాలు వచ్చాయంటే..?