Home » మీరు మారాలంటూ రవితేజకు అభిమాని ఓపెన్ లెటర్..అందులో ఏముందంటే..?

మీరు మారాలంటూ రవితేజకు అభిమాని ఓపెన్ లెటర్..అందులో ఏముందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు రవితేజ.. రవితేజ సినిమా అంటేనే అన్ని హంగులు కలగలిపి అన్ని భావాలు చూపించగల టాలెంట్ ఉన్న హీరో.. అలాంటి రవితేజ తన నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకొని మాస్ మహారాజా రవితేజ గా మారారు. ఇడియట్, విక్రమార్కుడు వంటి సినిమాలతో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. అలాంటి మాస్ మహారాజా గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కాస్త వెనకబడుతూ వస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వడం. అయితే తాజాగా మాస్ మహారాజా ధమాకా సినిమాతో మన ముందుకు వచ్చారు.

Advertisement

Also Read;“మసూద” సినిమాలో దయ్యం పట్టినట్టు నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కాస్త ముందుకు వెళ్తున్నా కానీ ఆయన వీరాభిమానులను మాత్రం మెప్పించడంలో వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. ఈ తరుణంలోనే ఆయన అభిమాని ఒకరు తన ఆవేదనను ఒక లెటర్ ద్వారా వెళ్లగక్కారు. రవితేజకు ఓపెన్ లెటర్ విసిరారు.. ఇంతకీ ఆ లెటర్లో ఆయన ఏం రాశారో ఇప్పుడు తెలుసుకుందాం.. ” రవితేజ సార్ మీరు మారాల్సిన సమయం వచ్చిందనుకుంటా .. నన్ను మారమని చెప్పడానికి నువ్వెవడ్రా అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు మారాలని చెప్పే హక్కు ఒక వీరాభిమానిగా నాకుంది. ఒకప్పటి ఇడియట్ రవితేజ మాకు కావాలి. అందుకోసమే మీరు మారాలి..

Advertisement

మీరు సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూసుకుంటున్నారా ..? అంటూ తన లెటర్ ద్వారా అభిమాని రవితేజను అడిగారు.. అంతేకాకుండా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ,మెగాస్టార్ వంటి అగ్ర హీరోలు ఇండస్ట్రీలో ఉన్న వారిని కాదని మీకు అభిమానిగా ఎందుకు మారానో తెలుసా .. మీరు ఏ ఆధారం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా ఎత్తుకు ఎదిగారు కాబట్టి.. అంటూ తన లెటర్ ను కొనసాగించేశారు.. అలాగే కాలం మారుతోంది హీరోల ఆలోచనలు కూడా మారుతున్నాయి. మీరు ఎందుకు ఆ పాత చింతకాయ పచ్చడిలాంటి స్టోరీలను ఎంచుకుంటున్నారు.. గతంలో మీ సినిమాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్ అన్నాడు. చివరికి ఒక మాట మీరు మారాల్సిన సమయం వచ్చింది సార్ అంటూ తన లెటర్ ను ముగించాడు.. ప్రస్తుతం అభిమాని రాసిన ఈ లెటర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.. మరి రవితేజ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Also read;Dhamaka movie: జగన్ సర్కార్ కు భారీ పంచ్ ఇచ్చిన “జబర్దస్త్” కమెడియన్..!

Visitors Are Also Reading