Home » మీ రాశి ప్రకారం అమావాస్య రోజున ఏఏ వస్తువులు దానం చేయాలో తెలుసా ?

మీ రాశి ప్రకారం అమావాస్య రోజున ఏఏ వస్తువులు దానం చేయాలో తెలుసా ?

by Bunty
Ad

అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది. ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము. అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీడిస్తోంది. అయితే అమావాస్య రోజున మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులు దానం చేయడం మంచిది. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

Advertisement

 

మేష రాశి వారికి అమావాస్య రోజున నీరు, నువ్వులు, కాగితాన్ని దానం చేయడం వల్ల కొన్ని చెడు శక్తుల కు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మీ కోరికలు నెరవేరుతాయి.

 

వృషభ రాశి వారు పాత్రలతో పాటు నువ్వులు కూడా దానం చేయడం మంచిది. ఇది చాలా మంచిదని నమ్ముతారు.

 

మిథున రాశి వారు కూడా ప్రతి అమావాస్య సందర్భంగా పేదలకు కలశం, చాదర్, గొడుగు దానం చేస్తే మీ సమస్యలన్నీ తీరుతాయి.

 

కర్కాటక రాశి వారు ప్రతి అమావాస్య సందర్భంగా అన్నదానం చేయాలి.

సింహ రాశి వారు ఈ రోజు పేదలకు అన్నదానం చేయాలి. ప్రధానంగా నీరు, షర్బత్ దానం చేయడం మంచిదన్నారు.

Advertisement

 

కన్యా రాశి వారు దేవాలయానికి లేదా ఏదైనా ఆశ్రమానికి పండ్లు, పప్పు, నూనెను దానం చేయాలి. ఇది మీ పనిలో అడ్డంకిని తొలగిస్తుంది.

 

తుల రాశి వారికి కుటుంబ సమస్యలు ఉంటే పేదలకు పత్తి, గుడ్డ, ఆవాలు దానం చేయడం ద్వారా సహాయం చేయవచ్చు. అలాగే కొందరికి నీటి పాత్రలు దానం చేయాలి.

 

వృశ్చిక రాశి వారు అమావాస్య రోజున అన్నదానం చేయాలి. ముఖ్యంగా పప్పుల కిచిడిని దానం చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీరు 5 నుండి 6 మందికి నీటి కుండలను దానం చేయాలి.

ధనస్సు రాశి వారు ఒక కుండ తీసుకొని అందులో నీళ్ళు నింపండి. ఆ కుండలో రకరకాల పప్పులతో నింపి పేదలకు దానం చేయండి. ఇలా ప్రతి అమావాస్య చేస్తే మంచిది.

 

మకర రాశి వారు కూడా ప్రతి అమావాస్య రోజున నీటి పాత్రను దానం చేయాలి. ముఖ్యంగా రాగి పాత్రలో నీటిని నింపుకోవచ్చు.

 

కుంభ రాశి వారు ఈ రోజున సబ్బు, బట్టలు, దువ్వెనలు దానం చేయాలి. అలాగే అమావాస్య రోజున వెండి పాత్రలో నీటిని దానం చేస్తే సమస్యలు తీరుతాయి.

 

మీన రాశి వారికి అమావాస్య రోజు ఇత్తడి కుండలో నీటిని దానం చేస్తే అనేక కుటుంబ సమస్యలు తీరుతాయి.

Read Also : టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

 

 

Visitors Are Also Reading