ఈ సరికొత్త టెక్నాలజీ కాలంలో ఎంతోమంది బిజీ లైఫ్ గడుపుతూ డబ్బుల వేటలో పడి అనారోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఉద్యోగ సమయమే కాకుండా ఎక్స్ ట్రా కూడా వర్క్ చేసి లేనిపోని అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా పల్లెటూరులో అయితే పొలం పనులు చూసుకుని వచ్చి రాత్రిళ్ళు హాయిగా నిద్రిస్తారు. కానీ సిటీల్లో పెద్ద పెద్ద భవంతుల్లో పనిచేసే వారికి పొద్దున రాత్రి అనే తేడా లేకుండా ఉంటుంది. డబ్బుల కోసం కనీసం నిద్రపోకుండా కష్టపడేవారు అనేకం ఉన్నారు..
Advertisement
also read:బ్రతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లి..30 కోట్ల లాటరీ కొట్టిన తెలుగోడు..!!
ఇలాంటి వారి గురించే ఆరోగ్య నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మానవ శరీరానికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అని, నిద్ర భంగం కలిగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్ర తప్పనిసరిగా పోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. నిద్ర లేకపోవడం వల్ల శరీరం అలాగే మెదడు పనితీరు చాలా మారుతుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా నిద్రలేకపోవడం వల్ల అధిక రక్తపోటు పెరుగుతుందట.
Advertisement
అంతేకాకుండా శరీరంలో విడుదలయ్యే హార్మోల సమతుల్యత దెబ్బతిని, దీనివల్ల అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుందని వారు అంటున్నారు. ఇవన్నీ కలిసి మెదడుపై ప్రభావం చూపడం వల్ల అనేక మానసిక రుగ్మతలు సంక్రమిస్తాయని , దీని కారణంగా రోగనిరోగ శక్తి తగ్గిపోతుందని సూచిస్తున్నారు. దీంతో బ్యాక్టీరియా, వైరస్ లు మన శరీరంలోకి వాటిని తట్టుకునే శక్తి శరీరంలో లేకుంటే కరోనా లాంటి వ్యాధుల బారినపడి మరణించే అవకాశం ఉంటుందని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనీసం ఒకరోజులో ఏడు గంటలైనా నిద్ర పోవాలని నిపుణులు అంటున్నారు..
also read: