కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం. నవరసాలను అవలీలగా పండించే అపర చాణిక్యుడు కైకాల సత్యనారాయణ అని చెప్పవచ్చు. అలాంటి గొప్ప నటుడిని ఇండస్ట్రీ కోల్పోయింది. మనం యముడిని ఇప్పటివరకు చూడలేదు కానీ యముడు అంటే ఎలా ఉంటాడో కైకల సత్యనారాయణ నటించిన సినిమాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ 23 2002లో తుది శ్వాస విడిచారు. అలాంటి కైకాల సత్యనారాయణ తన సినీ జీవితంలో దాదాపుగా 800 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు,రివార్డులు పొందాడు.
Advertisement
also read:హీరో అయ్యేందుకు నిఖిల్ అంతకష్టపడ్డాడా..? డబ్బులు ఇచ్చినా చివరికి..!
Advertisement
అలాంటి కైకాల వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కైకాల సత్యనారాయణ మంచి భోజన ప్రియుడు. భోజనం అంటే ఆయన నాన్ వెజ్ అంటేనే ఎక్కువగా ఇష్టపడేవారట. మటన్, చికెన్, ఉప్పు చేప పులుసు,నాటుకోడి పులుసు ఉంటే చాలు వదిలిపెట్టకుండా ఆరగించేవారట. ఈ విషయాన్ని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. కైకాల కు భోజనం అంటే ఎంత ఇష్టమో మెగాస్టార్ చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈ విధంగా కైకాల సత్యనారాయణ మరియు చిరంజీవి మధ్య మంచి సంబంధం ఉండేది.
చిరంజీవిని కైకాల సత్యనారాయణ తమ్ముడు అని ఆత్మీయంగా పిలిచేవారు. గత సంవత్సరం కైకాల సత్యనారాయణ బర్త్ డే సందర్భంగా చిరంజీవి ఆయన దగ్గరికి వెళ్లి బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయించిన విషయం మనందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఇంత మంచి అవినాభావ సంబంధం ఉండేది. అలాంటి కైకాల పరమపదించారని తెలుసుకున్న చిరంజీవి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.
also read: