ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు మూడు రోజుల కిందట జరిగిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ఏపీ ప్రజలకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏపీఎస్ఎఫ్ఎల్ కొత్తగా తొమ్మిది ప్యాకేజీలు ప్రకటించింది.
మరో 10 రోజుల్లో కొత్త ప్లాన్లతో ప్రారంభిస్తున్నట్లు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 19 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామని వెల్లడించారు. ప్రీపెయిడ్ విధానంలో బిల్లులు చెల్లింపు, ఏ ప్రాంతంలోనైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ను ప్రజలందరికీ చేరువ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement
ఏపిఎఫ్ఎల్ కొత్త ప్యాకేజీలు ఇవే.
190 రూపాయలకే 20 ఎంబిపిఎస్ స్పీడ్ తో 400 జీబీ ఇంటర్నెట్ డేటా.
రూ. 190 రూపాయల కనెక్షన్ తీసుకున్న వారికి ఉచితంగా సెటప్ బాక్స్.
రూ. 249కి 50 mbps స్పీడ్ తో 600gb ఇంటర్నెట్ డేటా.
రూ. 295 కి ఎఫ్టిఏ చానల్స్, 15 ఎంబీఎస్ స్పీడ్ తో 200gb ఇంటర్నెట్.
ఏపీఎస్ఎఫ్ఎల్ లో త్వరలోనే ఓటీపీ సేవలు
రూ. 299, రూ. 399, రూ. 799 తో ఓటిటి, ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపాయం.
రూ. 499, రూ. 699కే ఓటిటితో పాటు ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు.
READ ALSO : టాలీవుడ్ లో అత్యంత ధనికమైన హీరోలు వీరే