సాధారణంగా అమవాస్య రోజు రకరకాల నమ్మకాలుంటాయి. ఇవాళ ధనుర్మాస అమవాస్య కావడంతో కొన్ని పనులు చేయకూడదు అని పేర్కొంటున్నారు. అమవాస్య రోజు ఆయా రాశుల ప్రకారం.. కొన్ని వస్తువులను దానం చేయడం చాలా మంచిది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మేషం :
మేష రాశి వారు అమవాస్యరోజు నీరు, నువ్వులు, కాగితాన్ని దానం చేయడం వల్ల కొన్ని చెడు శక్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మీ కోరికలు నెరవేరుతాయి.
వృషభం :
ఇవాళ వృషభ రాశి వారు పాత్రలతో పాటు నువ్వులు దానం చేయడం చాలా మంచిది.
మిథునం :
ఈ రాశి వారు అమవాస్య సందర్భంగా పేదలకు చాదర్, కలశం, గొడువు వంటివి దానం చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి.
కర్కాటకం :
పేదలకు, ఆశ్రమాలకు నీటి పాత్ర, సబ్బు, బట్టలను దానం చేయాలి. దాదాపు 3 నెలల పాటు చేస్తే మీ ప్రణాళికలు పూర్తవుతాయి.
సింహం :
ఈ రాశి వారు పేదలకు అన్నదానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా నీరు, షర్బత్ వంటివి దానం చేయడం మంచిది. ఇలా దానం చేయడం వల్ల కుటుంబంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
కన్య :
Advertisement
కన్యరాశి వారు దేవాలయానికి లేదా ఏదైనా ఆశ్రమానికి పండ్లు, పప్పు, నూనెలను దానం చేయాలి. మీ పనిలో అడ్డంకిని తొలగిస్తుంది.
తుల :
ఈ రాశి వారికి కుటుంబ సమస్యలుంటే పేదలకు పత్తి, గుడ్డ, ఆవాలు వంటివి దానం చేయాలి. అదేవిధంగా కొంత మందికి నీటి పాత్రలను కూడా దానం చేయాలి.
వృశ్చికం :
ఈ రాశి వారు అమవాస్య రోజు అన్నదానం చేయాలి. ప్రధానంగా పప్పుల కిచిడీని దానం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. 5 నుంచి 6 మందికి నీటి కుండలను దానం చేయాలి.
ధనుస్సు :
ధనస్సు రాశి కుండ తీసుకొని అందులో నీళ్లు నింపాలి. ఆ కుండల రకరకాల పప్పులతో నింపి పేదలకు దానం చేయండి. ఇలా ప్రతీ అమవాస్య చేస్తే మంచిది.
మకరం :
మకరరాశి వారు ప్రతీ అమవాస్య రోజున నీటి పాత్రను దానం చేయాలి. ప్రధానంగా రాగి పాత్రలలో నీటిని నింపుకోవచ్చు.
కుంభం :
ఈ రాశి వారు ఈ రోజున సబ్బు, బట్టలు, దువ్వెనలు దానం చేయాలి. అదేవిధంగా అమవాస్య రోజు వెండి పాత్రల్లో నీటిని దానం చేస్తే సమస్యలు తీరుతాయి.
మీనం :
మీన రాశి వారు అమవాస్య రోజు ఇత్తడి కుండలో నీటిని దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా పలు సమస్యలు తీరుతాయి. కాాటన్ క్లాత్, షీట్లను కూడా దానం చేయాలి.