మనిషి జీవితంలోని అతి ముఖ్యమైన విషయాలలో పెళ్లి ఒకటి. ప్రతి వ్యక్తి జీవితంలో కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు పెళ్లి అంటే నూరేళ్లపంట అని మనకు ఉహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న వింటున్న మాట. ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామియానాలు, కిరాయికి ముత్తైదువులు, కాంట్రాక్టు వంటకాలు, పెళ్లి ప్యాకేజీ పేరుతో అంతా అరువు తెచ్చుకున్న మనుషులు కానే కాదు.
Also Read: Baba vanga: 2023లో భయానక విపత్తు.. బాబా వంగ భవిష్యవాణి..!!
Advertisement
తాటాకులతో పందిరి వేయాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. పెళ్లంటే జన్మకి ఒకేసారి జరిగే పండుగ. రెండు మనసులు జీవితకాలం కలిసి ఉండటానికి వేసే తొలి అడుగు. రెండు కుటుంబాలు జీవితకాలం రక్తసంబంధీకుల్లా కలిసిపోయే ఒక మహత్తర ఘట్టం. కొన్ని వేల మంది బంధుమిత్రులు దశాబ్దాల తర్వాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు. అయితే ఇది ఇలా ఉండగా, ఆడపడుచు చేత పెళ్లి కొడుకుని ఎందుకు చేయిస్తారు? అనే డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది. అయితే ఇవాళ దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
Advertisement
ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళగానే తన పుట్టింటితో అనుబంధము, హక్కులు పోయాయని దూరం అయ్యానని బాధపడుతుంది. అలాంటిదేమీ లేదు ఈ ఇంట్లో నీ హక్కు అలాగే ఉందని చెప్పి, వివాహ సమయంలో తోడబుట్టిన వాడిని పెండ్లి కొడుకుని చేయించడం దగ్గర నుంచి ఆమెకు లాంఛనాలు ఇప్పించడం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మగ పిల్లలు పట్టించుకోరేమోనని ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని, ఆమె చేతుల మీదుగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పడం ప్రధాన ఉద్దేశం.
Also Read: Pooja Hegde: ఛీ.. ఛీ.. నాకు ఆ పిచ్చి అస్సలు లేదంటున్న పూజా హెగ్డే..!!