యాంకర్ గా, స్క్రిప్టు రైటర్ గా, కమెడియన్ గా 70 కి పైగా సినిమాలలో నటించారు లక్ష్మీపతి. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆయనను అసలు మరచిపోలేరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెదబాబు వంటి సినిమాలలో ఆయన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. విలన్ గా ఆయన చేసిన ఏకైక సినిమా మహేష్ బాబు నటించిన బాబి. ఈ చిత్రానికి ఆయన తమ్ముడు శోభన్ దర్శకత్వం వహించారు. చూడాలని ఉంది సినిమాతో తెలుగులో బ్రేక్ తెచ్చుకున్నారు లక్ష్మీపతి. 2008లో ఆయన మరణించారు. ఆయన మరణం కంటే నెల రోజు ముందే ఆయన తమ్ముడు డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించారు.
Advertisement
కేవలం నెల రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ఇద్దరినీ కోల్పోవడం.. ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగా లేకపోవడం ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు లక్ష్మీపతి గారి కూతురు శ్వేత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి, బాబాయ్ తో ఉన్న అనుబంధాన్ని పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు శ్వేత. లక్ష్మీపతి గారికి ఇద్దరు తమ్ముళ్లు, వారికి సొంతూరులో రెండు సినిమా థియేటర్లు ఉండేవి. వారి ఆస్తులన్నీ కరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో లక్ష్మీపతి గారి తమ్ముడు శోభన్ రైటర్ గా అవకాశాలను వెతుకుతూ మద్రాస్ వెళ్లారు. అదేవిధంగా కృష్ణ సినిమా ‘రైతు భారతం’ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన బాబి సినిమాకు దర్శకత్వం వహించడంతో ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా అతని తమ్ముడు మరణించడంతో.. ఆ సమయంలో అంత్యక్రియలకు డబ్బులు లేకుండా ఉంటే యాక్టర్ అజయ్ ఇచ్చారట. ఇక సమయంలో నాన్న తాగి రావడం నచ్చక తన తండ్రితో కూడా గొడవపడ్డారట.
Advertisement
Also Read : అందుకే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నా…నయన్ సంచలన వ్యాఖ్యలు..!
ఆ సమయంలో తన తండ్రి తనను పట్టుకొని తెగ ఏడ్చేసారట. అందరూ ఏడుస్తున్న తను ఏడ్చకుండా ఆలయనే ఉండిపోయానని అందరూ నిద్రపోయాక రాత్రి సమయంలో ఏడ్చే దానిని అంటూ ఎమోషనల్ అయ్యారు శ్వేత. తండ్రి మరణించినప్పుడు తాను అధైర్యపడితే తనకన్నా చిన్నవాళ్ళు అయిన తమ్ముడు బాబాయ్ కొడుకుని కూడా భయపడతారని వాళ్ళ బాధ్యతను తాను తీసుకున్నారట శ్వేత. వైజాగ్ లో రేడియో జాకిగా పనిచేసిన శ్వేత తన తండ్రి కామా బాబాయిల మీద ఉన్న ప్రేమను పుస్తక రూపంలో అందరి ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం శోభన్ గారి అబ్బాయి సంతోష్ శోభన్ హీరోగా ఏకమైన కథ వంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : Kaikala Sathyanarayana : కైకాల సత్యనారాయణ సినీ, రాజకీయ ప్రస్థానం గురించి మీకు తెలుసా ?