వైవాహిక జీవితంలో భార్యా భర్తలు సంతోషంగా ఉండాలి. అప్పుడే కుటుంబ సభ్యులకు మనశ్శాంతి లభిస్తుంది. ఇక కొంతమందికి దాంపత్య జీవితంలో ఉన్నా కూడా అసలు సంతోషంగా ఉన్నామా లేదా అనే విషయం తెలియదని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా దాంపత్య జీవితం సంతోషంగా లేనివారిలో ఈ 5 సంకేతాలు కనిపిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
శృంగార జీవితం సరిగా లేనివారి దాంతప్య జీవితం సరిగా ఉండదని మానసిక నిపుణులు అంటున్నారు. వారికి శృంగార జీవితం పై కూడా ఆసక్తి ఉండదని చెబుతున్నారు. అంతే కాకుండా భార్యభర్తలకు తరచూ గొడవలు వస్తుంటే వారు సంతోషంగా లేనట్టేనని చెబుతున్నారు. ఇద్దరూ తరచూ గొడవలు పడటం దూషించుకోవడం లాంటివి చేస్తే వారు సంతోషంగా లేరని చెబుతున్నారు.
భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరికైనా తమ భాగస్వామితో విడిపోవాలనే ఆలోచనలు తరచూ వస్తుంటే అలాంటి వారు కూడా సంతోషంగా ఉండరని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వైవాహిక జీవితంలో అలాంటి ఆలోచనలు వచ్చాయంటే ఆ కాపురం నిలబడటం కూడా కష్టమని అంటున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కనీసం మాట్లాడుకోపోవడం లాంటివి చేస్తే వాళ్లు సంతోషంగా లేరని అర్థం వస్తుందని చెబుతున్నారు.
దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండాలని అలా లేకుండా ఉన్నా కూడా దాంపత్య జీవితం బోరింగ్ గా ఉంటుందని అలాంటి వారు సంతోషంగానూ మరియు బాధతోనూ కలిసి ఉండరని చెబుతున్నారు. భార్య భర్తలు ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకున్నప్పుడే ఇద్దరూ సంతోషంగా ఉంటారని అలా చేయకపోయినా సంతోషం ఉండదని చెబుతున్నారు.
ALSO READ: వీరసింహారెడ్డిలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నారా..?