ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతటి సంచలనం సృష్టించిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2019లో చైనాలో విజృంబించి 2020లో ప్రపంచ వ్యాప్తంగా భయబ్రాంతులకు గురి చేసింది. 2021 వరకు దాని నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న సమయంలోనే ప్రస్తుతం చైనాలో మరో సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆ వైరసే ఓమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్. ముఖ్యంగా చైనాలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో బీఎఫ్-7 వేరియంట్ కేసులు నమోదవ్వడంతో పాటు, మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
Advertisement
ఇక ఇప్పటికే చైనా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. జీరో కోవిడ్ విధానాన్ని కూడా చైనా ప్రభుత్వం ఎత్తేయంతో రానున్న మూడు నెలల్లో దాదాపు 10లక్షల వరకు మరణాలు సంభవిస్తాయని, జనాభాలో 60 శాతం మంది కోవిడ్ బారిన పడుతారని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కరోనా వేరియంట్ అయినటువంటి ఓమిక్రాన్ లో సబ్ వేరియంట్ ఈ “బీఎఫ్-7” వేగంగా వ్యాప్తి చెందుతోంది. బీఏ 2, బీఏ 5 వేరియంట్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటితో పోల్చితే బీఎఫ్-7 వేరియంట్ ఊహించని రీతిలో వ్యాప్తిస్తోంది. అతి తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ మందిని ఇన్ఫెక్షన్ కి గురి చేస్తుంది. తక్కువ కాలంలో వేగంగా వ్యాప్తి చెందడంతో చైనాలో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు టీకా వేసుకున్న వారికి కూడా బీఎఫ్-7 సోకడం గమనార్హం.
Advertisement
Also Read : అమ్మాయిలు ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలను అస్సలు నమ్మకండి..!!
ఒమిక్రాన్ బీఎఫ్-7 లక్షాణాలు
- ప్రధానంగా ఒమిక్రాన్ బీఎఫ్-7 ఎగువ శ్వాస కోశాన్ని ప్రభావితం చేస్తుంది.
- జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు కారటం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- కొంతమందికి వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
- కరోనా వేరియంట్ల మాదిరిగానే ఇది కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది.
- బీఎఫ్ -7 ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది.
- ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- ఇతర వేరియంట్లతో పోల్చితే బీఎఫ్-7 చాలా బలంగా ఉంది. వ్యాక్సిన్ల ద్వాారా వచ్చిన వ్యాధి నిరోధక శక్తిని కూడా సవాల్ చేస్తూ.. శరీరంలోకి ప్రవేశించి కరోనా వ్యాధికి కారణమవుతోంది.
Also Read : BF.7 : కరోనా కొత్త వేరియంట్ ఎంట్రీ.. ఇండియాలో మూడు కేసులు..