Home » అతడికి 35 ఏళ్లు..అనేక తిప్పలు పడి పెళ్లి చేసుకున్నాడు..కానీ భార్య ఏం చేసిందంటే..?

అతడికి 35 ఏళ్లు..అనేక తిప్పలు పడి పెళ్లి చేసుకున్నాడు..కానీ భార్య ఏం చేసిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నేటి సమాజంలో చాలామంది యువకులు వివిధ కారణాలవల్ల పెళ్లిలను వాయిదా వేస్తూ వస్తున్నారు. మరికొంతమంది అబ్బాయిలు అమ్మాయి దొరకక పెళ్లి చేసుకోవడం లేట్ అవుతోంది. దీంతో వారి వయసు పెరుగుతుండడంతో చివరికి ఏ అమ్మాయి దొరికినా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే ఒక యువకుడికి 35 ఏళ్లు దాటాయి. పెళ్లి కావట్లేదు. చివరికి ఒక పెళ్లిళ్ల పేరయ్యను సంప్రదించి తనకు పెళ్లి చేయమని చెప్పారు.. దీంతో ఆ వ్యక్తి ఒక అమ్మాయిని చూశాడు.. అంతా ఓకే అయింది.

Advertisement

also read;అందరి మాటలు భరించలేక.. కులాంతర వివాహం చేసుకుంటున్న యాంకర్ ప్రదీప్ !

పెళ్లి చేసుకున్న 15 రోజుల తర్వాత ఆ అమ్మాయి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.. మరి ఏం జరిగిందో వివరాలు చూద్దాం.. రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగాల్పూర్ ప్రాంతానికి చెందిన అటల్ బీహార్ అనే వ్యక్తికి 35 ఏళ్లు.. అంత వయసొచ్చిన వివాహం అవ్వటం లేదు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. పిల్ల కోసం పరితపిస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతగాడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక పెళ్లిళ్ల పేరయ్యను సంప్రదించాడు. చివరికి ఆ వ్యక్తి మూడు లక్షల రూపాయలు అమ్మాయికి ఇవ్వాలని ఒక కండిషన్ పెట్టి పెళ్లి కుదుర్చాడు. అమ్మాయి పేరు జైష్వాల్ సోనా.. అంతా ఓకే అయింది. వివాహం కూడా జరిగింది.

Advertisement

ఈ అటల్ చాలా సంతోషంతో ఉన్నాడు. సరిగ్గా 15 రోజులకు సమయం గడిచింది. అత్తింటి వారికి షాక్. సదరు అమ్మాయి 3,00,000 విలువైన బంగారు నగలతో ఉడాయించింది. దీంతో తన భార్య కనిపించడం లేదని చుట్టుపక్కల వెతికాడు. ప్రయోజనం లేదు. చివరికి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సోనా సొంత రాష్ట్రం మీద మధ్యప్రదేశ్ వెళ్లారు. ఆమె అడ్రస్ కనిపెట్టి ఆరా తీయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆమెకి ఇదివరకే పెళ్లయినట్టు వారి విచారణలో బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి యువకుల్లారా జాగ్రత్త.. మరి ఈ ఘటనపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..

also read;1200 రూ. కోసం శోభన్ బాబు అంత రిస్క్ చేశారా..ఏంటో తెలిస్తే గ్రేట్ అంటారు..!!

Visitors Are Also Reading