Telugu News » Blog » 1200 రూ. కోసం శోభన్ బాబు అంత రిస్క్ చేశారా..ఏంటో తెలిస్తే గ్రేట్ అంటారు..!!

1200 రూ. కోసం శోభన్ బాబు అంత రిస్క్ చేశారా..ఏంటో తెలిస్తే గ్రేట్ అంటారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నటువంటి శోభన్ బాబు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అనేక ఆపసోపాలు పడ్డారు. చేయకూడని రిస్కులు ఎన్నో చేశాడు.చివరికి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారారు. అలాంటి అందగాడు శోభన్ బాబు గురించి ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఈమంది రామారావు పలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ హీరో శోభన్ బాబు కెరియర్ మొదట్లో అద్దె కట్టడానికి కూడా అనేక ఇబ్బందులు పడ్డారట.

Advertisement

also read;Pragathi : ఏంటీ.. ప్రగతి ఆంటీ హీరోయిన్ గా చేసిందా..?

Advertisement

కేవలం 1200 రూపాయల కోసం ఆయన ఎంతో రిస్క్ ఉండే పాత్రను కూడా చేశారట. అయితే శివుని పాత్రలో ఆయన నటించాలి. ఆ పాత్ర చేయడం ఆయనకు ఇష్టం లేకపోయినా సరే తనకు డబ్బు అవసరం ఉంది కాబట్టి ఆ పాత్ర చేశారని ఈమంది రామారావు తెలియజేశారు. అయితే ఈ పాత్ర కోసం శోభన్ బాబు నిజమైన పామును మెడలో వేసుకుని రిస్కు చేశారని అన్నారు.

ఈ సీన్ షూట్ చేసే సమయంలో శోభన్ బాబు చాలా బాధపడ్డారని కామెంట్ చేశారు. ఈ పాత్ర కి గానూ శోభన్ బాబుకు 1200 రూపాయల పారితోషకం దక్కిందని తెలియజేశారు. ఆ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకు వచ్చిన డబ్బంతా స్థలాల కొనుగోలు పై పెట్టి ప్రస్తుతం కోట్లాది ఆస్తులను సంపాదించారు.

Advertisement

Also read;44 సినిమాలకు ఒక సెన్సార్ కట్ కూడా కానీ ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా ? 

You may also like