2022 ఏడాదిలో ర్యాగింగ్ బ్లాక్ బస్టర్ ల నుండి స్టుపిడ్ డిజాస్టర్ ల వరకు ప్రతిదీ చూసాం. ముఖ్యంగా ఈ ఏడాది కన్నడ సినిమాకి ఒక పెద్ద మైలురాయిగా మిగిలింది. కేజిఎఫ్2, కాంతారా లాంటి సంచలన సినిమాలు బాక్సాఫీస్ హిట్స్ తో యావత్ ఇండియాని షేక్ చేశారు. ఇక మన తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్ అయితే గ్లోబల్ సెన్సేషన్ అయింది. అయితే, ఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాల లిస్టు ఒకసారి చూద్దాం.
# బింబిసార:
Advertisement
కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బయ్యర్స్ కు రూ. 21.92 కోట్ల లాభాలను అందించింది.
# సీతారామం:
దుల్కర్ సల్మాన్ హీరోగా, మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన్న కీలకపాత్రలో తెరకెక్కిన ఈ మూవీ రూ.29.19 కోట్ల లాభాలను అందించింది.
# కార్తికేయ:
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రూ. 40 కోట్ల లాభాలను అందించింది.
# మసూద:
ఈ మూవీ మొత్తంగా రూ.4 కోట్ల లాభాలను అందించింది.
# గాలోడు:
Advertisement
సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన ఈ మూవీ మొత్తంగా రూ. 2.5 కోట్ల వరకు లాభాలను అందించింది.
# యశోద:
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ కూడా మొత్తంగా రూ. 2 కోట్ల వరకు లాభాలను అందించింది.
# హిట్ 2:
అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ మొత్తంగా రూ. 4 కోట్ల లాభాలను అందించింది.
# డీజే టిల్లు:
సిద్దు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రూ.7.57 కోట్ల లాభాలను అందించింది.
# ఆర్ ఆర్ ఆర్:
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ రూ. 108 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.
# మేజర్:
అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ బయ్యర్స్ కు రూ. 17.62 కోట్ల లాభాలను అందించింది.
Read also : అరుదైన ఫోటో షేర్ చేసిన వైఎస్ షర్మిల.. మోడ్రన్ లుక్ అదిరిపోయిందిగా !