Home » అవసరాల శ్రీనివాస్ పనే బాగుంది.. డైలాగ్ రైటర్ గా చేసే ఇంత సంపాదించాడా..?

అవసరాల శ్రీనివాస్ పనే బాగుంది.. డైలాగ్ రైటర్ గా చేసే ఇంత సంపాదించాడా..?

by Bunty
Ad

 

హాలీవుడ్ సినిమా అవతార్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ సినిమాను సినీ ప్రియులు ఎవరు మర్చిపోలేరు. దర్శకుడు జేమ్స్ కామెరున్ తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’ కు సీక్వెల్ గా వస్తున్న మూవీకి ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Advertisement

ఈ సినిమా ఇండియాలో మంచి ఆదరణ పొందుతోంది. అవతార్ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి వసుళ్లను రాబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మూడు రోజుల్లో 37 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి వావ్ అనిపించింది. ఇదిలా ఉండగా, ‘అవతార్’ తెలుగు వెర్షన్ కు టాలీవుడ్ దర్శకుడు, శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశారట. ఈ ఏడాది వచ్చిన మరో డబ్బింగ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ కి కూడా ఇతను సంభాషణలు అందించాడు. అవసరాల శ్రీనివాస్ అమెరికాలో చదువుకున్నాడు.

Advertisement

ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసేవాడు. హాలీవుడ్ మేకర్స్ తో ఇతనికి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే ‘అవతార్ 2’ కి ఇతన్ని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు మేకర్స్. అయితే, ‘అవతార్ 2’ కి డైలాగ్ రైటర్ గా చేసినందుకుగాను అవసరాల శ్రీనివాస్ కు రూ. 75 లక్షల వరకు పారితోషికం ఇచ్చారట. కేవలం డైలాగ్ రైటర్ గా చేసినందుకే ఇంత అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక అవసరాల శ్రీనివాస్, ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇతని దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

 

read also : అరుదైన ఫోటో షేర్‌ చేసిన వైఎస్‌ షర్మిల.. మోడ్రన్‌ లుక్‌ అదిరిపోయిందిగా !

Visitors Are Also Reading