చాలామంది దంపతులకు పెళ్లయిన తర్వాత కొంతకాలం వరకు కూడా పిల్లలు పుట్టకపోతే ఈ సమాజం నుంచి అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా అత్తింటివారు మహిళల్లోనే లోపం ఉందని సూటిపోటి మాటలతో వేధించే రోజులు ఇంకా ఉన్నాయి. నిజానికి బిడ్డకు జన్మనిచ్చేది స్త్రీ అయినా, ఆమె గర్భం దాల్చడంలో పురుషుడి పాత్ర కీలకంగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే ఆడవారిలో సంతానోత్పత్తిని పెంచేందుకు ఓ మొక్క ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ప్రకృతి ప్రసాదించిన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో అతి బలమైన మొక్క కూడా ఒకటి, దీనిని అడవి బెండకాయ, ముద్ర బెండ లేదా తుత్తూరు బెండ అంటారు. ఈ చెట్టుని దువ్వెన చెట్టు లేదా మధ్వ చెట్టు అని కూడా అంటారు. ఈ అతిబల చెట్టు గుండెకు మరియు నరాలకు, కిడ్నీలకు, కాలేయం మరియు క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు ఇంకా అనేక రకములైన వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ అతిబల ఆకు చూడటానికి రావి చెట్టు ఆకులనే ఉంటుంది.
Advertisement
మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడానికి, పిసిఒడి, థైరాయిడ్, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఎండోమెట్రియాసిస్ సమస్యలను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క వల్ల పిల్లలు కనే ఛాన్స్ వస్తుందని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు మగవారిలో వీర్యకణాల శక్తిని పెంపొందించడానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే నరాల బలహీనత, ఫిట్స్ ఉన్నవారికి కూడా చక్కగా పనిచేస్తుంది. అస్తమా, నిమోనియా, జలుబు వంటి శ్వాసకోస వ్యాధులకే కాకుండా సోరియాసిస్, బుల్లి మచ్చలు, డ్రై ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి : వాల్తేరు వీరయ్య ఫస్ట్ రివ్యూ.. సంక్రాంతికి చిరంజీవికి ఎలాంటి ఫలితం రానుంది?