తెలుగు సినిమా ఇండస్ట్రీలో దివంగత స్టార్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది.. ఆయన సినిమా ప్రయాణంలో నటించిన సినిమాల్లో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అల్లూరి సీతారామరాజు మాత్రమే. అప్పట్లో అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించారు.. ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.. అయితే ఈ మూవీకి ఆదినారాయణ రావు అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో “తెలుగువీర లేవరా పాటకు” జాతీయ అవార్డు దక్కింది.. ఇక అల్లూరి సీతారామరాజు పాత్ర వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
Advertisement
ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రామచంద్రరావు 70 శాతం షూటింగ్ పూర్తవగానే అనుకోకుండా మరణించారు. దీంతో మిగిలిన షూటింగును కె ఎస్ ఆర్ దాస్ పూర్తి చేశారు.. ఈ విధంగా తెరకెక్కిన ఈ సినిమా అనేక రికార్డులు సాధించింది.. కృష్ణ తన సినీ కెరియర్ లో 350 పైగా చిత్రాలు చేస్తే అల్లూరి సీతారామరాజు ఒక ప్రత్యేకమైన స్థానం. చరిత్రలో నిలిచిపోయిందని చెప్పవచ్చు.. అయితే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ చేయాలని ముందుగా అనుకున్నారట. కానీ ఆయనకు తీరిక లేకపోవడంతో కృష్ణ తీశారు.. అయితే ముందుగా ఈ సినిమాను ఓ నిర్మాత శోభన్ బాబు తో చేయాలని స్క్రిప్ట్ రెడీ చేయించారు.. కానీ అది కుదరలేదు..
Advertisement
ఏది ఏమైనా కృష్ణకు ఈ పాత్ర రాసి పెట్టింది.. ఆయనకి ఎంతో పేరు తీసుకొచ్చింది. కానీ ఇదే పాత్ర ఎన్టీఆర్ కు చేయాలని చాలా ఇష్టం ఉండేదట.. ఎలాగైనా అలాంటి పాత్ర చేయాలని మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఒక పాటలో అల్లురి సీతారామరాజు గెటప్ లో కనిపించి మరి సందడి చేశారు ఎన్టీఆర్.. ఈ విధంగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయమందుకుంది.. భారీ కలెక్షన్స్ సాధించి కృష్ణకు మంచి గుర్తింపు తేవడమే కాకుండా అనేక అవార్డుల పంట పండించింది.. కృష్ణ కెరియర్ లోనే మర్చిపోలేని పాత్రను ఈ చిత్రం ఇచ్చిందని చెప్పవచ్చు.
also read: