Home » manchu Manoj: మంచు మనోజ్ కి ఏమైంది.. అంత ఎమోషనల్ అయ్యాడేంటి..?

manchu Manoj: మంచు మనోజ్ కి ఏమైంది.. అంత ఎమోషనల్ అయ్యాడేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కలెక్షన్ కింగ్ మంచి మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మనోజ్.. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ లు కొట్టాడు.. అలాంటి మంచు మనోజ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన అభిమానులతో ప్రతి విషయాన్ని పంచుకుంటారు.. ఈ విధంగా ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.. అలాంటి మనోజ్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాడు.. భూమా మౌనిక రెడ్డితో ఆయన రిలేషన్ షిప్ లో ఉన్నాడని, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి.. ఇదే విషయంపై మంచు ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పిందని అయినా మనోజ్ వినకుండా బయటకు వచ్చేసాడని వార్తలు వినిపించాయి..

Advertisement

also read:Avatar 2 : ‘అవతార్‌ 2’ రివ్యూ

అలాంటి మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చాలా బాధ పడుతున్నాడని తెలుస్తోంది.. ఈ తరుణంలో ఆయన ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ చేశాడు.. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.. గత కొంతకాలం నుంచి మంచు మనోజ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు.. తన కుటుంబంతో ఎంత కలవాలని ప్రయత్నాలు చేసినా వారు పట్టించుకోవడం లేదట.. కట్ చేస్తే మంచు మనోజ్ తల్లి నిర్మల దేవి పుట్టినరోజు రెండు రోజుల క్రితం జరిగింది. ఈ తరుణంలో ఆయన తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.. తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు..

ఈ ఫోటో కింద క్యాప్షన్ ఇలా ఇచ్చాడు.. “నా ప్రాణానికి ప్రాణమైనటువంటి మా అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అమ్మ నీకు అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను.. ఈ సంవత్సరం నువ్వు ఏది కోరుకుంటే అది జరగాలని ఆశిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అంటూ ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశాడు”.. ప్రస్తుతం ఆయన చేసిన ట్విట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.. దీంతో అభిమానులంతా తల్లిని కలుసుకోవాలని బిడ్డ ఆరాటం ఏ విధంగా ఉందో అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుందని మంచు మనోజ్ కు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.. చాలామంది ఎమోషనల్ కావొద్దు అంటూ తనకు సపోర్ట్ గా నిలుస్తూ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..

also read:

Visitors Are Also Reading