Home » Jr. NTR 20 ఏళ్ల సెంటిమెంట్ ను చిరు కాపీ కొడుతున్నారా..?

Jr. NTR 20 ఏళ్ల సెంటిమెంట్ ను చిరు కాపీ కొడుతున్నారా..?

by Sravanthi
Ad

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా త్వరలో రిలీజ్ అయ్యే చిత్రాల గురించి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.. ముఖ్యంగా చిరు అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాల్తేరు వీరయ్య కూడా త్వరలో రాబోతోంది.. ఈ మూవీ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ రాబోతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం.. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా సెంటిమెంట్ ను వాల్తేరు వీరయ్య మూవీ కోసం ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. 20 సంవత్సరాల క్రితం జరిగిన అరుదైన సంఘటన తాజాగా వాల్తేరు వీరయ్య విషయంలో రిపీట్ అవ్వనుందని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక కోసం మూవీ మేకర్స్ తీసుకున్న నిర్ణయం అభిమానులను కాస్త కలవర పెడుతోందని చెప్పవచ్చు.

Advertisement

also read:నటి అభినయకు జైలు శిక్ష.. ఒక ఆడపిల్ల మరో ఆడపిల్లకు అన్యాయం చేసిన వేళ..!!

ఇంతకీ ఆ నిర్ణయం ఏంటయ్యా అంటే.. సంక్రాంతి సినిమాలకు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లోనూ జోరు పెంచుతున్నారు ఈ చిత్ర యూనిట్. ఇప్పటికే వీర సింహారెడ్డి షూటింగ్ కంప్లీట్ అయింది. అనిల్ రావిపూడి తో బిజీగా ఉన్నారు బాలయ్య. మరోవైపు చిరంజీవి ఫ్రాన్స్ లో శృతిహాసన్ తో చాలా స్పీడ్ షూటింగ్లో ఉన్నాడు. చివరి పాటల చిత్రీకరణ అయిపోతే వాల్తేరు వీరయ్య షూటింగ్ కూడా అయిపోయినట్టే. అయితే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయట. దీనికోసం హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ లను వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం ఆంధ్రవాలా సీన్ రిపీట్ అయినట్టే. డిసెంబర్ 3, 2003 వ సంవత్సరం నిమ్మకూరులో జరిగిన ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా రైలు వేశారు. అప్పట్లో ఆంధ్రావాలా ఈవెంట్ ఒక సంచలనంగా మారింది.

Advertisement

ఆ వేడుకకు వచ్చినంత మంది అభిమానులు ఇప్పటివరకు ఈ సినిమా హిస్టరీలో ఏ వేడుకకు రాలేదు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ స్పెషల్ ట్రైన్స్ వేయించాలనే ఆలోచన వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి అభిమానుల కోసం ప్రత్యేకంగా 20 బోగీలు ఉన్న ట్రైన్ ను పెట్టనున్నట్టు తెలుస్తోంది. జనవరి 8వ తేదీన వరంగల్, వైజాగ్,గుంటూరు ఏదో ఒకచోట ఈ వేడుకను జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సీన్ రిపీట్ అవ్వబోతోంది. ఈ తరుణంలోనే చిరు అభిమానులు కాస్త ఇబ్బంది పడుతున్నారు.. అదేంటంటే ఆంధ్రవాలా సినిమా ఫ్లాప్ అయింది.. కాబట్టి అదే రిపీట్ కావద్దని వారు కోరుకుంటున్నారు.

also read:

Visitors Are Also Reading