మంచు లక్ష్మి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా సినిమాల్లోకి రాకముందే మంచు లక్ష్మి హాలీవుడ్ సీరియల్స్ లో నటించింది. తన తండ్రితో కలిసి చిన్నవయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ మంచు లక్ష్మి విలన్ గా నటించి మెప్పించింది.
Advertisement
ప్రస్తుతం మంచు లక్ష్మి సినిమాలతో పాటూ టీవీ షోలు కూడా చేస్తోంది. అంతే కాకుండా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన పోస్టులు మరియు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో తన పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా మంచు లక్ష్మి ఇప్పటి వరకూ వాటి పై స్పందించలేదు.
Advertisement
మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇటీవల తెలంగాణలో కొన్ని ప్రభుత్వ స్కూల్స్ ను మంచు లక్ష్మి దత్తత తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సంచలనం గా మారింది. తన పోస్ట్ లో మంచు లక్ష్మి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చాలా చేశాను.
కానీ ఇప్పుడు వాటిని సరిదిద్దుకోలేను. అయితే ఫ్యూచర్ మాత్రం మళ్లీ అలాంటి తప్పులు చేయను..నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అంతే కాకుండా మంచు లక్ష్మి ఎప్పుడూ డేరింగ్ డాషింగ్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి ట్వీట్ చేసింది అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.