Home » ఫిఫా ఫైనల్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించనున్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్..?

ఫిఫా ఫైనల్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించనున్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్..?

by Anji
Ad

ఫిఫా ప్రపంచ కప్ 2023లో అర్జెంటీనా జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. క్రొయేషియాతో జరిగిన సెమిఫైనల్ లో లియోనెల్ మెస్సి మ్యాజిక్ తో ఆ జట్టు ఫైనల్ కి చేరుకుంది. ప్రధానంగా మెస్సి అర్జెంటీనా తరుపున ప్రపంచ కప్ లో ఇప్పటివరకు 5 గోల్స్ చేసి వాహ్ అనిపించాడు. తన జట్టును ఫైనల్ కి తీసుకెళ్లడంలో మెస్సీ పాత్ర కీలకమనే చెప్పాలి. ముఖ్యంగా సెమీఫైనల్ లో అర్జెంటీనా 3-0తో క్రొయేషియా పటిష్ట జట్టును ఓడించి ఫైనల్ కి ప్రవేశించింది. ఈ మ్యాచ్ తరువాత మెస్సీ అభిమానులకు ఆశ్చర్యపరిచే వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement

 ప్రధానంగా ప్రపంచ కప్ ఫైనల్ తరువాత మెస్సీ రిటైర్ మెంట్ తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అర్జెంటీనా మీడియా వెలువరించి కథనాల  ప్రకారం..డిసెంబర్ 18న జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాబోతున్నట్టు సమాచారం.  35 ఏళ్ల మెస్సీ ఫైనల్ తరువాత అర్జెంటీనా జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడు. 

Advertisement

Also Read :  పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేదం? 

Manam News

అర్జెంటీనా మీడియా సంస్థ అయినటువంటి డయారియో డిపోర్టివో ఓలేతో మెస్సీ ఇలా మాట్లాడారు. “నేను దీనిని సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా చివరి మ్యాచ్ ను ఫైనల్ లో ఆడడం ద్వారా నా ప్రపంచ కప్ ప్రయాణాన్ని ముగించుకుంటాను. ఈ సందర్భంగా సంబురాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని చెప్పుకొచ్చాడు మెస్సీ. అర్జెంటీనా మళ్లీ ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకుంది. క్లిష్ట పరిస్థితులను చూశాం. కానీ ఈరోజు అద్భుతమైన ఆటను ప్రదర్శించామంటూ తెలిపాడు మెస్సి . 

Also Read :  పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేదం? 

Visitors Are Also Reading