కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటే మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే రాశులను బట్టి సైతం లవ్ మ్యారేజ్ చేసుకోవాలా..? అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా అనే ఆలోచనలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారు కచ్చితంగా ప్రేమ వివాహం చేసుకోవాలని కోరుకుంటారని చెబుతున్నారు. అంతేకాకుండా అలా కోరుకున్న వారికి అరేంజ్ మ్యారేజ్ చేసినా కూడా వృధానే అని అంటున్నారు.
Advertisement
ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం…. మేషరాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారని అంటున్నారు. ఈ రాశి వారు ప్రేమించే వారిని పూర్తిగా నమ్ముతారట. ఇతరులతో తమ సంబంధానికి ఎంతో విలువ ఇస్తారని చెబుతున్నారు. ఈ రాశి వారు తమ స్నేహితులతో ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వీళ్లు ప్రేమ పెళ్లి చేసుకోవడానికి అసలు ఆలోచించరని.. కాబట్టి వీరితో ప్రేమ వివాహం చాలా ఆనందంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Advertisement
వృషభ రాశి వారు కూడా ప్రేమించడం మొదలుపెడితే పీకల్లోతు ప్రేమలోకి వెళ్ళిపోతారట. కానీ ఆ విషయం మాత్రం ఇష్టపడేవారికి చెప్పరట. పెళ్లి చేసుకోవాలని ఉన్నా వీళ్ళు సైలెంట్ గా ఉంటారని జోతిష్యులు చెబుతున్నారు. వీళ్ళు కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడానికి అసలు ఇష్టపడరట. అంతేకాకుండా మిథున రాశి వారికి సైతం అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టపడరని చెబుతున్నారు.
వీళ్ళు చాలా చురుకుగా డైనమిక్ గా కనిపిస్తారని ఎప్పుడూ అలాగే ఉంటారని అంటున్నారు. అయితే ఈ రాశి వాళ్లు ఏ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరని…..ఎవరితోనూ గట్టి బంధాన్ని ఏర్పరచుకోరని చెబుతున్నారు. కానీ ప్రేమ పెళ్లి విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటారని అంటున్నారు. కాబట్టి మిథున రాశి వారు సైతం పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడరని…. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
ALSO READ : రజనీకాంత్ అంటే శ్రీదేవికి అంతపిచ్చా.. ఆయన కోసం ఏకంగా 7 రోజులు అన్నం తినకుండా..!!