భార్య భర్తల మధ్య మంచి అనుబంధం ఉన్నప్పుడే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. భార్యా భర్తలు ఒకరి పై మరొకరు అధికారం చాలాయించుకోకుండా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవాలి. అలా రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడే ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరు గౌరవం ఇవ్వకపోయినా మరొకరు బాధపడం లేదా కోపం పెంచుకోవడం జరుగుతుంది.
Advertisement
కాగా భర్తలు ఎక్కువగా తమ భార్యలు గౌరవం ఇవ్వడం లేదని బాధపడుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తమ వద్దకు వచ్చే కేసుల్లో ఎక్కువ కేసుల్లో తమ భార్యలు గౌరవం ఇవ్వలేదని తమ పిల్లలు గౌరవం ఇవ్వట్లేదు అనే కేసులే ఎక్కువ శాతం ఉంటాయని చెబుతున్నారు.
Advertisement
అంతే కాకుండా ఇంట్లో గౌరవం ఉంటేనే సమాజంలోనూ గౌరవం వస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంట్లో గౌరవం పొందాలంటే కొన్ని పనులు చేయాలని అంటున్నారు. సాధారణంగా ఉద్యోగం చేస్తూ బాధ్యతగా కుటుంబ బాధ్యలు నిర్వహిస్తున్న భర్తలకు భార్యలు గౌరవం ఇస్తారని చెబుతున్నారు. కానీ ఇంటి విషయాల గురించి పట్టించుకోకుండా ఉద్యోగం చేయకుండా జల్సాలు చేసే వాళ్లకు భార్యలు గౌరవం ఇవ్వరని చెబుతున్నారు.
కాబట్టి ఇంట్లో గౌరవం రావాలంటే మొదట బాధ్యగా నడుచుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే కొంత మంది ఎంతపనిచేసినా కుటుంబాన్ని చూసుకున్నా కూడా గౌరవం ఉండదు. అయితే అలాంటి ఇంటిలో భార్యలు తమ భర్త కష్టానికి విలువ ఇస్తూ గౌరవం ఇవ్వాలని చెబుతున్నారు.