తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా వెంకటేష్ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న హీరో దగ్గుబాటి రానా.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు రానా.. వచ్చిన అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారిగా చేసిన సినిమా లీడర్..
Advertisement
also read;Bigboss 6 Telugu: శ్రీహాన్ కి సిరి బ్రేకప్ చెప్పినట్టేనా.. కారణం ఏంటంటే..?
Advertisement
దీని తర్వాత జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇక అప్పటి నుంచి నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలు చేసి స్టార్ హీరోగా మారారు.. అలాంటి రానా ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఎలాంటి సినిమా అనౌన్స్ కూడా చేయడం లేదు.. దీనికి కారణం ఏంటి అనేది చూద్దాం.. విరాటపర్వం, భీమ్లా నాయక్ సినిమా తర్వాత మరో సినిమా రానా నుంచి రాలేదు. దీంతో ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రానా లో మునుపటిలా జోష్ కనిపించడం లేదని అనుకుంటున్నారు. మరి సినిమాలకు ఇంత గ్యాప్ ఇవ్వడానికి కారణం ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు తెలుస్తోంది.. ఆరోగ్యం దృష్ట్యా అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ రానా తన హెల్త్ కోసం అమెరికా వెళ్లాలని తెలుస్తోంది.. ఇక ఈ విషయంపై రానా స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.
also read;రాజమౌళి సినిమాలు రిజెక్ట్ చేసిన 7గురు స్టార్స్ వీళ్లే..!!