Home » రాజమౌళి సినిమాలు రిజెక్ట్ చేసిన 7గురు స్టార్స్ వీళ్లే..!!

రాజమౌళి సినిమాలు రిజెక్ట్ చేసిన 7గురు స్టార్స్ వీళ్లే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు.. ఆయన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దర్శకులలో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడని చెప్పవచ్చు.. అలాంటి దర్శకుడు ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఆఫర్ల కోసం ఎంతోమంది నటీనటులు ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాల్లో ఏ చిన్న క్యారెక్టర్ దొరికిన వదులుకోరు. అలాంటి దర్శక ధీరుడు జక్కన్న ఆఫరిస్తే రిజెక్ట్ చేసిన హీరో, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..

బాలకృష్ణ- మగధీర:

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. అలాంటి బాలకృష్ణకు దర్శక ధీరుడు జక్కన్న మగధీర కథను ముందుగా వినిపించారట. కానీ ఆయన ఏవో కారణాలవల్ల రిజెక్టు చేశారట..
కాజల్ -యమదొంగ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ఎంతటి హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో ముందుగా కాజల్ ను తీసుకుందామని భావించారట దర్శకుడు. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఒప్పుకోలేదట..
ప్రభాస్- సింహాద్రి:

పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జక్కన్న చేతిలో పడి ఈ స్టేజ్ కి వచ్చారు.. అయితే ముందుగా ఎన్టీఆర్ చేసిన సింహాద్రి మూవీ ప్రభాస్ ని అడిగారట.. కానీ ఆయనకు సెట్ కాదని వదిలేసారట..
అమితాబ్ – బాహుబలి

Advertisement

బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు.. చిత్రంలో కట్టప్ప పాత్రకు ముందుగా అమితాబచ్చన్ అనుకున్నారట. కానీ ఆయన ఏవో కారణాలవల్ల చేయలేకపోయారట.

also read:కెప్టెన్సీ నిషేదం విషయంలో కీలక ప్రకటన చేసిన డేవిడ్ వార్నర్.. భావోద్వేగ పోస్ట్ కు కారణం అదేనా ?

జాన్ అబ్రహం – బాహుబలి

జాన్ అబ్రహంను బాహుబలి సినిమాలో బల్లాలదేవుని పాత్ర వరించిందట. కానీ ఆయన కూడా రిజెక్ట్ చేశారట.
శ్రీదేవి- బాహుబలి

బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంతటి ఆదరణ అందుకుందో మనందరికీ తెలుసు. ఈ పాత్ర ముందుగా అలనాటి నటి శ్రీదేవికి వెళ్ళిందట.. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో రమ్యకృష్ణ కు అదృష్టం కలిసి వచ్చింది.
పవన్ కళ్యాణ్- విక్రమార్కుడు

విక్రమార్కుడు సినిమా ద్వారా రవితేజ ఎంతటి సంచలన విజయన్ని అందుకున్నారో మనకు తెలుసు. ముందుగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లిందట. కానీ ఆయన డేట్స్ కుదరకపోవడంతో రిజెక్ట్ చేశారు.
శ్రద్ధా కపూర్- ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలన విజయనందుకుందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో ఒలీవియా మోరిస్ జెన్ని క్యారెక్టర్ కోసం ముందుగా శ్రద్ధ కపూర్ ను సంప్రదించారట. కానీ ఆమె రిజెక్ట్ చేసిందట.

also read:

Visitors Are Also Reading