Home » అబ్బాయిల్లో అమ్మాయిలకు అస్సలు నచ్చని 4 అలవాట్లు.. ఏంటంటే?

అబ్బాయిల్లో అమ్మాయిలకు అస్సలు నచ్చని 4 అలవాట్లు.. ఏంటంటే?

by Sravanthi
Published: Last Updated on
Ad

స్త్రీ పురుషులకు ఎవరికి వారికే కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. ఒకరికి ఉన్న అలవాటు మరొకరికి ఉండకపోవచ్చు. నీకు నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. ఆ విధంగా పురుషులలో ఉండే ఈ అలవాట్లు స్త్రీలకు అస్సలు నచ్చవట. అలాంటి అలవాట్లు ఉన్న పురుషులను స్త్రీలు అస్సలు ఇష్టపడరని కొంతమంది నిపుణులు అంటున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

 

చెడు ప్రవర్తన:
స్త్రీలు ఎప్పుడైనా సరే మంచి ప్రవర్తన ఉన్నటువంటి పురుషులను ఇష్టపడతారు. దురుసుగా మాట్లాడుతూ ఇతరులను చులకన చేసే పురుషులను అస్సలు ఇష్టపడరు. అయితే స్త్రీల ముందు ఎప్పుడైనా సరే ఇతరులను కించపరిచినట్టు భయపెట్టినట్టు మాట్లాడకూడదని అంటున్నారు.

Also Read:  Matti kusthi review: మట్టి కుస్తీ మూవీ రివ్యూ& రేటింగ్..!!

Advertisement

ప్రణాళికలు మార్చడం:
సాధారణంగా స్త్రీల క్యారెక్టర్ ప్రకారం చూసుకుంటే ఏదైనా ప్రణాళిక వేసుకొని దాని ప్రకారమే వెళ్లాలి. కానీ అది మార్చడానికి స్త్రీలు అస్సలు ఇష్టపడరు. కాబట్టి స్త్రీలతో ఏదైనా టూర్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తే ఒక్కసారి మాత్రమే ప్లాన్ చేసుకోండి. దాని ప్రకారమే ఫాలో అవ్వండి. కానీ దాన్ని రిజెక్ట్ చేసి మళ్లీ వెళ్దామని పక్కన పెడితే వారు మిమ్మల్ని అస్సలు నమ్మరు..
ప్రేమ చూపించకపోవడం:
సాధారణంగా పదిమందిలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామిపై విరుచుకు పడడం, తక్కువ ప్రేమను చూపించడం వల్ల స్త్రీలు మీపై బ్యాడ్ ఫీలింగ్ పెంచుకుంటారు. కాబట్టి ఈ విధంగా చేయకుండా ప్రేమను చూపిస్తూ వారిని ఏ విధంగా మెస్మరైజ్ చేయాలో ఆ విధంగానే ఉండాలి.

సందిగ్ధంలో ఉండడం:
మీరు ఏ టైంలో అయినా సరే ఏదో ఒకటి ఆలోచించుకుంటూ సందిగ్ధంలో ఉండడం స్త్రీలకు అస్సలు నచ్చదు. ఈ సందిగ్ధంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు బలహీనులని స్త్రీలు భావిస్తారట. ముఖ్యంగా మహిళలు కఠిన నిర్ణయాలు తీసుకునే పురుషులను ఎక్కువగా ఇష్టపడతారట.

also read:

Visitors Are Also Reading