తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ కోసం కొన్ని ప్రత్యేకమైన పేజీలు రాసిపెట్టి ఉంటాయని చెప్పవచ్చు.. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు.. ఆయన ఎదిగే క్రమంలో ఎందరో అవమానించారు, ఎన్నో ఆపసోపాలు పడ్డారు.. వాటన్నింటిని దిగమింగుకొని తను అనుకున్నది సాధించాడు. నటనే ప్రథమావధిగా నమ్ముకొని ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా మారారు.. అలాంటి మెగాస్టార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం.. మెగాస్టార్ కు ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్.. అయితే ఆయన పెద్ద కుమార్తె సుస్మిత గురించి అందరికీ తెలిసిందే. ఆమెను చెన్నైలో స్థిరపడినటువంటి వ్యాపారవేత్త కుటుంబంలోకి ఇచ్చాడు..వీరి కుటుంబం రాయలసీమ నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడ్డారు..
Advertisement
also read:సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ సందర్భంగా ఓ అభిమాని చేసిన పనికి అందరూ ఫిదా అవ్వాల్సిందే..!
Advertisement
ప్రముఖ వ్యాపారవేత్త అయినా ఎల్వీ రామారావు పెద్ద పేరు మోసిన బిజినెస్ మాన్.. ఆయన అప్పట్లోనే అమెరికా, థాయిలాండ్, జపాన్, సింగపూర్ వంటి దేశాలతో వ్యాపార లావాదేవీలు నడిపేవారట. ఆయన కుమారుడు ఎల్వి ప్రసాద్ చంద్రిక దంపతుల కుమారుడే విష్ణు ప్రసాద్.. ఈ విష్ణు ప్రసాద్ కి చిరంజీవి తన కూతురు సుస్మితను ఇచ్చి వివాహం చేశారు. విష్ణు ప్రసాద్ బిజినెస్ రంగాల్లో అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ చేశారు. విదేశాల్లో చదువు పూర్తయ్యాక వారి వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టారు.
విష్ణు ప్రసాద్ తాతయ్య మొదలుపెట్టిన పామాయిల్ వ్యాపారం తన తండ్రి సారథ్యంలో కొంత డెవలప్ అయింది, ఆ తర్వాత విష్ణు ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటినుంచి వ్యాపారం రెండింతల పెరిగిపోయింది. ప్రపంచ దేశాలకే మేలురకం పామ్ ఆయిల్ ఎగుమతి చేయడం మొదలు పెట్టిన విష్ణు ప్రసాద్ కోటాను కోట్లకు అధిపతి.. అయితే ఈ జంటకి ఇద్దరు అమ్మాయిలు.. ప్రస్తుతం సుస్మిత సినీ రంగంలో అడుగు పెట్టింది. చిరు మరియు రామ్ చరణ్ సినిమాలకు స్టైలిష్ గా వ్యవహరిస్తోందంటే కారణం విష్ణు ప్రసాద్. తన భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది సుస్మిత.
also read: