తెలుగు ఇండస్ట్రీలో మాటలమేటి యాంకర్, సమయస్ఫూర్తితో ఎలాంటి ప్రోగ్రామ్స్ నైనా సక్సెస్ ఫుల్ బాటలో నడిపించే మాటల తూట ఎవరయ్యా అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది యాంకర్ సుమ మాత్రమే.. ఆమె తన యాంకరింగ్ తో ఎంతటి స్టార్ నటులనైనా మెస్మరైజ్ చేయడంలో దిట్ట.. అలాంటి యాంకర్ సుమ గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది..
Advertisement
also read;ఎంత పని చేశావు మంగ్లీ పదవి కోసం ఇంత త్యాగమా? దీని కంటే దారుణం ఉంటుందా..!!
అదేంటయ్యా అంటే.. సుమ మరియు నటుడు రాజీవ్ కనకాల పెళ్లి గురించి.. వీళ్ల పెళ్లి వెనుక పెద్ద కథ ఉందని తెలుస్తోంది.. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.. సుమా రాజీవ్ కనకాలది ప్రేమ వివాహం అని మనందరికీ తెలుసు. దూరదర్శన్ లో నటించే టైంలో సుమను తొలిసారి చూశారట రాజీవ్ కనకాల. ఈ విధంగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.
Advertisement
జీవనరాగం సీరియల్ లో నటించే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల ఆమెకు ప్రపోజ్ కూడా చేశారట. కానీ మొదట్లో సుమ రాజీవ్ కనకాలకు నో చెప్పింది కానీ తర్వాత ఓకే చేసిందట. దీంతో వీరి వివాహం 1999 ఫిబ్రవరి 10వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత ఇద్దరు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతూ రాజీవ్ కనకాల మంచి పేరున్న నటుడిగా, సుమా స్టార్ యాంకర్ గా మరియు యాక్టర్ గా దూసుకుపోతోంది.
also read;మెగాస్టార్ బాస్ పార్టీ సాంగ్ ని ముందే చూసేసిన పవర్ స్టార్..!