Home » పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి… తప్పు మాట్లాడాలి అంటే భయపడాలి అంటూ వారిపై కేసు…!

పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి… తప్పు మాట్లాడాలి అంటే భయపడాలి అంటూ వారిపై కేసు…!

by AJAY
Ad

ప్రముఖ తెలుగు యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ రవి కూకట్ పెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కొంతమంది సోషల్ మీడియా… యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదని రవి ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు.

Anchor ravi

Anchor ravi

రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్పల్ పల్లి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా తప్పు మాట మాట్లాడాలంటే భయం పుట్టాలి…టైప్ చేయాలంటే భయపడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా యాంకర్ రవి సంథింగ్ స్పెషల్ అనే షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మా మ్యూజిక్ లో ప్రసారమైన ఈ షో కు మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement

Advertisement

also read :  ఆలీ ప‌క్క‌న న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌…సంచ‌లన నిజాలు బ‌య‌ట‌పెట్టిన ఎస్వీ కృష్ణారెడ్డి..!

యాంకర్ రవి, లాస్య కలిసి చేసే సందడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత రవి యాంకర్ గా వరస ఆఫర్లు అందుకున్నాడు. రీసెంట్ గా ఈటీవీ ప్లస్ లో వచ్చిన పటాస్ టీవీ షో ద్వారా కూడా రవికి ఎంతో పాపులారిటీ వచ్చింది. మరోవైపు రవి ఓ సినిమాలోనూ హీరోగా నటించి అలరించాడు. ఇదిలా ఉంటే యాంకర్ రవి ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా ఆకట్టుకున్నాడు. చివరి రెండు వారాలు ఉన్న సమయం లో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. కాగా ఇప్పుడు తన పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం వల్ల పోలిసులకు ఫిర్యాదు చేశాడు.

Visitors Are Also Reading